International Women’s Day: ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘అమ్మ పాద పూజ & ఆశీర్వ‌చ‌నం’

ZPTC Uppala Venkatesh

ద‌ర్వాజ‌-రంగారెడ్డి
International Women’s Day: అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌ష్క‌రించుకుని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘అమ్మ పాద పూజ & ఆశీర్వ‌చ‌నం’ కార్యక్ర‌మం నిర్వ‌హించారు. తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు మండల ప్రజా పరిషత్ సౌజన్యంతో నిర్వహించిన ‘ అమ్మ పాద పూజ మ‌రియు ఆశీర్వచనం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తలకొండపల్లి ZPTC , ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, శ్రీమతి శ్రీ ఉప్పల మంజుల – వెంకటేష్ పుణ్య దంపతులు, డాక్టర్ ఉప్పల అఖిల్, డాక్టర్ మేఘన దంపతులు మరియు ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా పడకల్ గ్రామంలో ఐదు గ్రామాల ప్రజలతో సుమారు 2500 మంది మహిళా మూర్తులతో అంగరంగ వైభవంగా అమ్మ పాద పూజ కార్యక్రమం నిర్వహించుకోవడం ఆనందంగా ఉంద‌ని అన్నారు. నేటి సమాజంలో ఒక నూతన మంచి ఒరవడిని తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు మంచి పౌర సమాజ నిర్మాణం కోసం దోహదపడతాయని ఆయ‌న ఆకాంక్షించారు. అలాగే, అమ్మ పాద పూజ కార్యక్రమం లో పాల్గొన్న 2500 మంది మహిళలకు తన ట్రస్ట్ ద్వారా చీరలు పంపిణీ చేసి ఆ మహిళలను గౌరవించారు.

ZPTC-Uppala-Venkatesh2-1024x576 International Women’s Day: ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 'అమ్మ పాద పూజ & ఆశీర్వ‌చ‌నం'

ఈ కార్యక్రమంలో AVOPA రాష్ట్ర అధ్యక్షులు మల్లిపెద్ది శంకర్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, Ex MPP లక్ష్మీదేవి రఘురాములు, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్, స్థానిక ఎంపీటీసీ జోగు రమేష్, స్థానిక యువ నాయకులు విజయ్,శృతిలయ కల్చరల్ అకాడమీ చైర్మన్ దాసన్న కళాబృందం, తిరుమల తిరుపతి దేవస్థానం ఓం నమో వెంకటేశాయ శ్రీ చంద్రశేఖర రావు, కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగల్ విండో డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు, అనుచరులు పాల్గొన్నారు.

mother-1024x576 International Women’s Day: ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 'అమ్మ పాద పూజ & ఆశీర్వ‌చ‌నం'

Related Post