దర్వాజ-తెలంగాణ
YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీలో తన పార్టీ ఏర్పాటు గురించి సంచలన కామెంట్స్ చేశారు. హైదారాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో.. ఏపీలో పార్టీ పెడుతున్నారా? అని మీడియా ప్రతినిధులు అడగ్గా.. షర్మిల ఇలా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టాలి.. పెట్టకూడదు అనే రూల్ అయితే లేదు కదా.. అంటూ అంటూ సమాధానమిచ్చారు.
అంటే పార్టీలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని ఆమె కామెంట్స్ చేశారు. ఇక షర్మిల చేసిన వ్యాఖ్యలతో ఏపీలోనూ ఆమె పార్టీ పెట్టబోతుందంటూ వార్తలు షికార్లు కొడుతున్నాయి. అయితే గతంలో షర్మిల ఏపీ రాజకీయాలపై స్పందన వేరేలా ఉండేది. ఒకానొక సమయంలో ‘నా రాజకీయ జీవితం మొత్తం తెలంగాణ ప్రజలకే అంకితం’ అని మాట్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే.
కానీ ఎవరూ ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయని ఆమె స్పంధించడం గమనించాల్సిన విషయమే. ఇక తమ పార్టీ ఒక మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు వెళుతోందని షర్మిల తెలియజేశారు.ఇకపోతే షర్మిలకు, జగన్ కు మధ్య విభేదాలు తలెత్తాయని ఈ మధ్యన తరచుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే క్రిస్మస్ వేడుకల్లో కూడా ఈ అన్నా చెళ్లెల్ల మధ్య విబేధాలు వచ్చాయంటూ గాసిప్స్ వస్తున్నాయి. ఏదేమైనా ఏపీ లో పార్టీ ఏర్పాటుపై షర్మిల తన వ్యాఖ్యల్లో చెప్పకనే చెప్పేసింది.
Hot Food : వేడి వేడిగా ఆహారాన్ని తింటున్నారా..? అయితే మీరు ఆ ప్రమాదాల్లో పడ్డట్టే..
Vaccination: నేటి నుంచి 15-18 ఏండ్ల వారికి వాక్సినేషన్.. అరగంట పాటు కేంద్రం లేనే..!
Deepthi-Shanmuk Breakup: షణ్ను, దీప్తిల బ్రేకప్ కు కారణం నేను కాదు: సిరి
WhatsApp Accounts Ban: 17.5 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఎందుకంటే..?
Varshini Hot Show: అరే ఏంట్రా ఇది.. వర్షిణీ ఇలా కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది..?
India Corona Updates: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
Share this content: