Breaking
Tue. Nov 18th, 2025

ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే రఘునందన్ రావు నెరవేర్చాలి..

darvaaja, Telugu news, Telugu News updates, తాజా వార్త‌లు, తెలుగు న్యూస్‌, ద‌ర్వాజ‌, TPS, TRS, Sriram Ramakrishna Prabhu, BJP, MLA Raghunandan Rao, Dubbaka, by-elections, Siddipet, Mallanna Sagar, Prabhakar Reddy, టీపీఎస్, టీఆర్ఎస్, శ్రీరామ్ రామకృష్ణ ప్రభు, బీజేపీ, ఎమ్మెల్యే రఘునందన్ రావు, దుబ్బాక, ఉప ఎన్నికలు, సిద్దిపేట, మల్లన్న సాగర్, ప్రభాకర్ రెడ్డి,

ద‌ర్వాజ‌-దుబ్బాక

Telangana News: దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీపీఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీరాం రామకృష్ణ ప్రభు అన్నారు. బుధవారం దుబ్బాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేనేత కార్మికులు, మల్లన్న సాగర్ ముంపు బాధితుల సమస్యలు నెరవేర్చి,చేనేత కార్మికులకు దుబ్బాకలో మెగా టెక్స్ టైల్ పార్కు ను కేంద్ర మంత్రి చేత ఏర్పాటు చేస్తానని, చేనేత కార్మికులకు రూ 3000 వేల పింఛన్ ఇపిస్తానని,మల్లన్న సాగర్ కాల్వ ముంపు బాధితులకు సిద్దిపేట తరహా పరిహారం ఇపిస్తానని,లేదంటే రాజీనామా చేస్తానని హామీలు ఇచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న నెరవేర్చడం లేదని శ్రీరాం రామకృష్ణ ప్రభు ఆవేదన వ్యక్తంచేశారు.

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తన ఉచిత హామీలు దుబ్బాక నియోజకవర్గ పర్యటన చేపట్టి తమ హామీలు ప్రజల వద్దకు తీసుకెళ్లి ఆ దిశగా పోరాటం చేస్తామని, ప్రజల ఓట్లతో గెలిచిన, మీరు ప్రజల కోసం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడం తగదని రామకృష్ణ ప్రభు అన్నారు. మెదక్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశానుసారం త్వరలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో పర్యటిస్తానని అన్నారు. తమ హామీలు ఆరు నెలల్లో నెరవేర్చకుంటే రాజీనామా చేస్తాన్న రఘునందన్ రావు వెంటనే తమ హామీలు ఏమైనయో తెలపాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు గుంటి రాజు, పర్శరాములు, మహేష్, రాజయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Related Post