దర్వాజ-అమరావతి
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మురుగ భక్తర్గల్ మానాడులో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం మదురై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆయనకు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా ఆయన్ను పలువురు బీజేపీ ప్రముఖులు కలుసుకున్నారు. వీరిలో తమిళనాడు ఆబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రవర్తి, రాష్ట్ర నాయకుడు అమర్ ప్రసాద్ రెడ్డి, మదురై జిల్లా అధ్యక్షుడు మారి చక్రవర్తి, జనరల్ సెక్రటరీ రామ శ్రీనివాసన్, ప్రముఖ రాజకీయ నాయకుడు శ్రీ రాధాకృష్ణన్ ఉన్నారు.
తిరుపరా కుంద్రం ఆలయ దర్శనం
పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ సాయంత్రం తిరుపరా కుంద్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించబోతున్నారు. ఆయన భక్తిశ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
మురుగ భక్తర్గల్ మానాడులో ముఖ్య అతిథిగా పవన్
ఆలయ దర్శనానంతరం పవన్ కళ్యాణ్ మురుగ భక్తర్గల్ మానాడులో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమం మదురైలోని అమ్మ తిడాల్ ప్రాంగణంలో జరుగుతోంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భక్తులతో మాట్లాడే అవకాశం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సాంస్కృతిక అనుబంధానికి సంకేతంగా నిలిచే కార్యక్రమంగా భావిస్తున్నారు.
ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ ఉత్సాహంగా పాల్గొంటున్న తీరును అభిమానులు, రాజకీయ విశ్లేషకులు విశేషంగా ప్రశంసిస్తున్నారు.
మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు వచ్చిన శ్రీ @PawanKalyan గారికి బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు pic.twitter.com/PBGSlqx1WT
— JanaSena Party (@JanaSenaParty) June 22, 2025
