దర్వాజ-కేశంపేట
పలువరు ఆర్టీసీ బస్ కండక్టర్లు ప్రయాణికులతో సరిగ్గా నడుచుకోవడం లేదనీ, మరీ ముఖ్యంగా ఫ్రీ బస్ పథకం తీసుకువచ్చిన తర్వాత ప్రయాణికులతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఆడ పిల్లలు అని చూడకుండా బూతులు తిడుతున్న ఆర్టీసీ బస్ కండక్టర్ పై ఫిర్యాదు చేశారు పలువురు విద్యార్ధినిలు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నుండి కేశంపేట మండలంలోని సంగెం గ్రామానికి ఉదయం సాయంత్రం వేళల్లో ఆర్టీసి బస్సు నడుస్తుంది. అయితే ఆ బస్సులో ఆయా గ్రామాల నుండి విద్యార్థి, విద్యార్థినిలు చదువుకోవడానికి షాద్ నగర్ వెళ్లి వస్తుంటారు.
అయితే విద్యార్ధినుల పట్ల రాములు అనే బస్ కండక్టర్ బూతు మాటలు తిడుతూ ఉంటారని విద్యార్థినులు అవేదన వ్యక్తం చేశారు. ఆధార్ అప్ డేట్ లేకపోయినా, బ్యాగ్‌లో నుండి ఆధార్ బయటకు తీయడంలో ఆలస్యమైనా బండబూతులు తీట్టి మధ్యలోనే బస్సును ఆపి దింపి వేస్తున్నాడని వాపోయారు. ఈ క్రమంలోనే ఆ బస్ కండక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు.