దర్వాజ-తెలంగాణ
New year celebrations : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ వేడుకల రద్దు చేయాలని హైకోర్టులో విటిషన్ దాఖలు కావడంతో పోలీసులు కొత్త సంవత్సర వేడుకల్లో పాటించాల్సిన నిబంధనలను ప్రకటించారు. ఇక వీటిని ఏ మాత్రం నెగ్లెట్ చేసినా.. పాటించక పోయినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏయే నిబంధనలు జారీ చేశారంటే..
- ఈ వేడుకల్లో పాల్గొనే వారు ఖచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుని ఉండాలి. ఒక్క డోసు వేసుకున్న వారు అనర్హులు.
- మాస్కు తప్పని సరిగ్గా ధరించాలి. లేకపోతే రూ.1000 జరిమానా విధిస్తారు.
- కొత్త సంవత్సర వేడుకలు ఎవరైతే నిర్వహించాలనుకుంటున్నారో.. వాళ్లు రెండు రోజుల ముందే పర్మిషన్ తీసుకుని ఉండాలి. అందులోనూ ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొనే వాళ్లకు కరోనా టెస్ట్ లు ఖచ్చితంగా చేయించాలి.
- బహిరంగ ప్రదేశాల్లో(రోడ్లపై) డీజీలకు పర్మిషన్ లేదు.
- ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.
- ఇక ఈ వేడుకల్లో అసభ్యకరమైన బట్టలు వేసుకున్నా.. డ్యాన్సులు చేసినా కఠిన చర్యలు ఉంటాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరికలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే.. న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ సర్కార్ మందు పార్టీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 31 డిసెంబర్ రోజున వైన్ షాపులు 12 గంటల వరకు తెరిచే ఉంటాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వైన్స్ ఓపెన్ చేసినప్పటికీ డ్రైంకన్ డ్రైవ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని తేల్చి చెప్పింది. అయినా కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ ఈ సెలబ్రేషన్స్ కు అవకాశం ఇవ్వడం ఒక రకంగా కరోనా వ్యాప్తికి దారి తీయడమే అవుతుంది. ఎన్ని ఆంక్షలు పెట్టినా.. ఈ సెలబ్రేషన్స్ తో కరోనా పెరగడం మాత్రం పక్కా అని జనాలు అనుకుంటున్నారు.
Krithi Shetty : సన్నజాబి పువ్వులా మెరిసిపోతున్న బేబమ్మ.. మరీ ఇంత అందమేంటిరా బాబూ..
Hair Problem Tips: వెంట్రుకలకు నూనె రాసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు అస్సలు ఊడదు..
Deepika Pilli: ఏమి అందం ఏమి అందం.. దీపిక పిల్లి మరీ ఇంత అందంగా ఎలా పుట్టావమ్మా..
Sweater Dangers: చలికాలంలో స్వెటర్ వేసుకుని పడుకుంటున్నారా..? అయితే మీకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినట్టే.?
Gold Rates Today: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?