Breaking
Fri. Jun 27th, 2025

Sujana Chowdary: లండన్‌లో గాయపడిన సుజనా చౌదరి.. హైదరాబాద్‌కు తరలింపు!

దర్వాజ – హైదరాబాద్


Sujana Chowdary: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి లండన్ పర్యటనలో ఉండగా గాయపడ్డారు.  ఓ సూపర్ మార్కెట్‌లో నడుస్తుండగా ఆయన జారిపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కుడి భుజంలోని ఎముక బాగా విరిగినట్లు సమాచారం.

వెంటనే ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, పూర్తి చికిత్స కోసం భారత్‌కి తరలించాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. అక్కడ సర్జరీ చేయనున్నట్టు తెలుస్తోంది.

సుజనా చౌదరి రాజకీయాల్లోకి టీడీపీ ద్వారా ప్రవేశించారు. రెండు సార్లు రాజ్యసభకు ఎంపికైన ఆయన, మోదీ తొలి సర్కార్‌లో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత టీడీపీని వీడి బీజేపీలో చేరారు.

ఇటీవల జరిగిన 2024 శాసనసభ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి, వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి ఆసిఫ్ షేక్‌పై 47,032 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొంది ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై పార్టీ వర్గాలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆయన కోలుకుని మరల ప్రజాసేవలో చేరాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

By Nikhila

Related Post