దర్వాజ-హైదరాబాద్
Coronavirus: దేశంలో కరోనా కల్లోలం మొదలైంది. చాలా రాష్ట్రాల్లో ఆందోళనకర స్థాయిలో Coronavirus కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిత్యం వేలల్లోనే కోవిడ్-19 కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. తెలంగాణలోనూ రోజువారీ కరోనా వైరస్ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం… రాష్ట్రంలో గత 24 గంటల్లో 1920 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మొత్తం కోవిడ్-19 కేసులు 6,97,775కు చేరాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో కరోనా వైరస్ తో పోరాడుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,045కి చేరింది. కరోనా నుంచి కొత్తగా 417 మంది బయటపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం 15,969 యాక్టివ్ కేసులు (Covid-19) ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో మొత్తం 83,153 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.
కరోనా వైరస్ మరణాల రేటు 0.57 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.05 శాతంగా ఉంది. ఇంకా 15,969 మంది Covid-19 పరీక్ష ఫలితాల రిపోర్టులు రావాల్సి ఉంది. నిన్నటితో పోలిస్తే కరోనా కొత్త కేసులు వందకు పైగా పెరిగాయి.
Covid 19 : త్రిషకు కరోనా.. ఆస్పత్రిలో చేరిన కట్టప్ప..
Turmeric Side Effects: పసుపును ఈ వ్యాధిగ్రస్తులు అస్సలు తినకూడదు.. ఎందుకంటే..?
Covid-19 New Variant : వెలుగులోకి వచ్చిన మరో కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే చాలా డేంజర్..
Deepthi Sunaina: దీప్తి సునయన బాధలో ఉంటే .. షణ్ముఖ్ సిరితో చిల్ అవుతున్నాడా..?
Share this content: