దర్వాజ-హైదరాబాద్
Telangana High Court: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే, అధికారపార్టీ నేత వనమా వెంకటేశ్వర రావు ఎన్నికల చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నికను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది.
వివరాల్లోకెళ్తే.. కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వర రావు ఎన్నికను రద్దు చేస్తూ జలగం వెంకట్రావును కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 12 డిసెంబర్ 2018వ తేదీ నుంచి ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. జలగం వెంకట్రావు అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున కొత్తగూడెం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి తన కాంగ్రెస్ ప్రత్యర్థి వనమా వెంకటేశ్వర్ రావు చేతిలో ఓడిపోయారు.
తన ప్రత్యర్థి వనమా వెంకటేశ్వర్ రావు తనకు, తన భార్యకు సంబంధించిన పూర్తి ఆస్తుల వివరాలను ఫారం 26లో ఎన్నికల సంఘానికి ఇవ్వలేదని ఆరోపిస్తూ జలగం వెంకట్ రావు దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించినట్లు జలగం వెంకట్ రావు తరఫు న్యాయవాది రమేష్ కుటుంబక తెలిపారు.
అలాగే, వెంకటేశ్వర్ రావుకు కోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది. జలగం వెంకట్రావు అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున కొత్తగూడెం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి తన కాంగ్రెస్ ప్రత్యర్థి వనమా వెంకటేశ్వర్ రావు చేతిలో ఓడిపోయారు.