దర్వాజ-తెలంగాణ
Liquor Sales: ఆనందం.. దుఖ: . పండుగలు.. పబ్బాలు.. దావత్ లు.. చావులు.. ఇలా ఏదైనా రానీయ్యండి.. వీటికి పక్కాగా మందు ఉండాల్సిందే. అంతెందుకు కొందరు ఇలాంటి సమయాల కోసం వేచి చూస్తే మరికొందరేమో.. సమయ సందర్భం తో పని లేకుండా మందుతో గొంతు తడుపుకుంటారు. రోజూ చుక్కలేనిదే ముద్ద కూడా దించని వారు లేకపోలేదు. ఏదేమైనా మన సర్కారుకు మందు బాబులే అసలు సిసలైన ఆదాయం తెచ్చిపెడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. సీజన్ తో సంబంధం లేకుండా బాటిళ్లకు బాటిళ్లు.. ఖాళీ చేయడంలో మందు బాబులెప్పుడూ ముందేనబ్బా.
అదీ కాక చలికాలం షురూ కావడంతో.. మందు సీసాల జోరు పెరిగింది. చీకటి పడితే చాలు.. చుక్కతో కిక్కు ఎక్కించుకుంటున్నారు. సలికి వేడి పుట్టిస్తుందంటూ సీసాల మీద సీసాలు ఖాళీ చేసేస్తున్నారు. ఇక న్యూ ఇయర్ సందర్బంగా మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. అది ఎంతలా అంటే డిసెంబర్ 1వ తేదీ నుంచి 31 వరకు ఏకంగా రూ.3,459 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. ఇక 2020 డిసెంబర్ లో అయితే రూ.రూ.2,764 కోట్ల సరుకు అమ్ముడైంది. ఇక ఈ డిసెంబర్ లో మాత్రం రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి.
కాగా 2021 ఏడాది మొత్తంలో రూ.30,196 కోట్ల మద్యం అమ్ముడుపోతే.. డిసెంబర్ చివరి 5 రోజుల్లో ఏకంగా రూ. 902 కోట్ల మందు సీసాలను ఖాళీ చేసారంటే మామూలు మాటలు కాదు. అదీ కాక ఒక్క డిసెంబర్ 31న రాత్రి 7 గంటల సమయం వరకు ఏకంగా రూ. 172 కోట్ల మందు సీసాలను గుటకాయ స్వాహా అనిపించారు. ఇకపోతే 2021 లో డిసెంబర్ నెలలోనే అత్యధికంగా లిక్కర్ అమ్ముడు పోయిందని ఎక్సైజ్ శాఖ వెళ్లడిస్తోంది. ఇక పోయిన ఏడాదిలో 3.68 కోట్ల లిక్కర్ , 3,25,82,859 బీర్లను మందు బాబులు ఖాళీ చేసారని ఎక్సైజ్ శాఖ వెళ్లడించింది. ఏదేమైనా మందు బాబులతో తెలంగాణ సర్కారుకు గట్టి ఆదాయం అయితే వస్తుందిగా.
Pushpa Deleted Scene: పుష్ప సీన్ అదిరిపోలా.. మరెండుకు తీసేస్నారబ్బా..!
TS News : ‘తెలంగాణలో నేరాలు పెరిగినయ్’
Shriya Saran: భర్తను ముద్దులతో ముంచెత్తుతున్న శ్రియ సరన్..
Heart Attack Signs: హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలివే..!
Samantha: ఏంటీ సమంత వర్కౌట్స్ చేసేది ఇందుకోసమా..?
Share this content: