దర్వాజ-తెలంగాణ
TS News : గతేడాది(2020)తో పోల్చుకుంటే ఈ ఏడాది రాష్ట్రంలో నేరాలు బాగా పెరిగాయని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. 2021 వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాతూ.. 2020 తో పోల్చుకుంటే.. 2021 లో తెలంగాణలో 4.6 శాతం నేరాలు పెరిగాయని అన్నారు. అందులో శిక్ష పడ్డ కేసులు 50.3 శాతంగా ఉన్నాయన్నారు. కాగా 80 కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్లల్లో 120 మందికి జీవిత ఖైదు శిక్షలు పడ్డాయని డీజీపీ స్పష్టం చేశారు.
11.24 లక్షల ఫిర్యాదులు ఒక్క 100 డయల్ నెంబర్ ద్వారానే స్వీకరించామని వెల్లడించారు. షీ టీమ్స్ ద్వారా బాధితులకు భరోసా కల్పించడంలో ముందుంటున్నామని అన్నారు. ఇకపోతే 83 వేల కు పైనే ఫిర్యాదులు హ్యాక్ ఐ నుంచి వచ్చాయని డీజీపీ వెళ్లడించారు. నిత్యం నేరాలకు, దారుణాలకు ఒడిగడుతున్న 664 మంది నేరస్థులపై పీడీ యాక్ట్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఇక ఈ ఏడాదిలోనే మొత్తంగా సైబర్ నేరాలు 8828 నమోదైనట్టు వెళ్లడించారు.
కాగా 6690 మంది రోడ్డు ప్రమాదాల్లోనే మరణించారని ఆయన తెలియజేశారు. రూ.879 కోట్లను ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారికి జరిమానాగా విధించడమైందని డీజీపీ స్పష్టం చేశారు. కరోనా కష్ట కాలంలో కూడా ఎంతో సమర్థవంతంగా పోలీసులు పనిచేశారని ఆయన ప్రశంసించారు. నేరాలను, దారుణాలను నియంత్రించడంలో పోలీసులు సమన్వయంతో పనిచేశారు. పోలీసులు పడ్డ కష్టానికి తగిన ఫలితం వచ్చింది. ప్రజల సహకారంతోనే ఎలాంటి గొడవలు, ఘర్షణలు జరగకుండా చూసుకుంటున్నామని డీజీపీ వివరించారు.
Pushpa Deleted Scene: పుష్ప సీన్ అదిరిపోలా.. మరెండుకు తీసేస్నారబ్బా..!
Shriya Saran: భర్తను ముద్దులతో ముంచెత్తుతున్న శ్రియ సరన్..
Heart Attack Signs: హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలివే..!
Samantha: ఏంటీ సమంత వర్కౌట్స్ చేసేది ఇందుకోసమా..?
Corona Bulletin: డౌటే లేదు థర్డ్ వేవ్ మొదలైనట్టుంది.. భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..
Share this content: