దర్వాజ-హైదరాబాద్
Telangana Assembly Elections 2023: తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.జ ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్‌కు చివరి తేదీ నవంబర్ 19 భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికల జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు నర్వహించనున్నట్టు ప్రకటించింది. ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్‌కు చివరి తేదీ నవంబర్ 10గా పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికలు ఒకే దశలో నవంబర్ 30 పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు:
ఈవెంట్స్ | తేదీలు |
పోల్ నోటిఫికేషన్ తేదీ | నవంబర్ 3, 2023 |
నామినేషన్ల చివరి తేదీ | నవంబర్ 10, 2023 |
నామినేషన్ల పరిశీలన తేదీ | నవంబర్ 13, 2023 |
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ | నవంబర్ 15, 2023 |
ఎన్నికలు (పోలింగ్) తేదీ | నవంబర్ 30, 2023 |
ఓట్ల లెక్కింపు తేదీ | డిసెంబర్ 3, 2023 |
ఎన్నికలు ముగిసే చివరి తేదీ | డిసెంబర్ 5, 2023 |
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండగా, బీఆర్‌ఎస్ వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇదివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో BRS గా మారిన TRS 119 స్థానాలకు గాను 88 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకుముందు సీట్ల వాటాలో గణనీయమైన పెరుగుదల 25గా ఉండగా, దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ సీట్ల వాటా తగ్గింది.
AIMIM ఏడు స్థానాలను గెలుచుకోగలిగింది. బీజేపీ కేవలం ఒక్క గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గం సీటును రాజా సింగ్ గెలుచుకున్నారు. అంతకుముందుతో పోలిస్తే కాషాయ పార్టీ సీట్ల వాటా ఐదు నుంచి ఒకటికి పడిపోయింది. మొత్తంగా ఇప్పటికే రసవత్తరంగా మారిన తెలంగాణ రాజకీయాల్లో.. ఎన్నికల షెడ్యూల్ విడుదల మరింత హీటెక్కించేలా కనిపిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోనే వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తొలి నాయకుడిగా కేసీఆర్ అవతరిస్తారో లేదో చూడాలి !