Breaking
Tue. Nov 18th, 2025

బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అరెస్ట్..

బండి సంజ‌య్, బీజేపీ, ఆర‌వింద్, టీఆర్ఎస్, తెలంగాణ‌, హైదరాబాద్, Bandi Sanjay, BJP, Arvind, TRS, Telangana, Hyderabad,

ద‌ర్వాజ‌-జనగాం

బండి సంజ‌య్ అరెస్ట్: జనగాం వద్ద నిరసనకు పిలుపునిచ్చిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ను మంగ‌ళ‌వారం అరెస్ట్ చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఇంటి బయట ఆందోళన చేస్తున్న బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు కొట్టడంపై నిరసన పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ నివాసం వద్ద టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, బీజేవైఎం కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి కవితపై కొందరు బీజేపీ నేతలు ఆరోపణలు చేయడంతో బీజేవైఎం, బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు నిరసన చేపట్టారు. అయితే కవిత తనపై వ‌స్తున్న‌ ఆరోపణలను కొట్టిపారేసింది. అసత్య ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇంజక్షన్ ఆర్డర్‌ను కోరిన కవిత..

కాగా, త‌న‌పై ఆరోపణలు చేస్తున్న వారిపై ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయిస్తానని కవిత తెలిపారు. “నాపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి…ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్‌లో చెప్పిన దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు. వారి చేతుల్లో అన్ని ఏజెన్సీలు ఉన్నాయి, వారు అవసరమైన ఏ విచారణనైనా చేయగలరు. పూర్తిగా సహకరిస్తాం’’ అని కే కవిత తెలిపారు. కేంద్రప్రభుత్వ విధానాలపై మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తిచూపుతుండ‌టంతోనే బీజేపీ ఇలా చేస్తోందని, తద్వారా తన కుటుంబం ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు.

Related Post