దర్వాజ-హైదరాబాద్
TS SSC Result 2023: మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. TS SSC Result 2023 లో ఉత్తీర్ణత శాతం 86.6 శాతంగా నమోదైంది. పదో తరగతిలో బాలికల ఉత్తీర్ణత శాతం 88.53, బాలుర ఉత్తీర్ణత శాతం 84.68 శాతంగా ఉంది. ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని పాఠశాలలు 25 ఉన్నాయి. 99 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిర్మల్ జిల్లా, 59.46 శాతంతో వికారాబాద్ చివరి స్థానంలో ఉన్నాయి.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదో తరగతి ఫలితాలను విడుదుల చేశారు. గత నెల 3 నుంచి 13 వరకు జరిగిన పరీక్షలకు 2 లక్షల 49 వేల 747 బాలురు.. 2 లక్షల 44 వేల 873 మంది బాలికలు కలిపి మొత్తం 4 లక్షల 94 వేల 620 మంది విద్యార్థులు హాజరయ్యారు.
పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు 4.91 లక్షలు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు 4.19 లక్షలు. 2,793 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రయివేటుగా పరీక్షలు రాసిన విద్యార్థులు 7,492 కాగా, వారిలో 44.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జూన్ 14 నుంచి 22 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 26 (మే 26) వరకు ఉంటుందని తెలిపారు.
తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2023 కోసం ఇక్కడ క్లిక్ చేయండి..