Loading Now
Telangana: CM KCR announces notification for 80,039 govt jobs

Telangana: కొలువుల జాత‌ర‌.. 91,142 పోస్టులు నోటిఫై.. 80,039 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలు ఇవిగో..

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్
Telangana: రాష్ట్రం కోలువుల జాత‌ర మొద‌లైంది. ఉద్యోగాల భ‌ర్తీపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 91,142 పోస్టులను నోటిఫై చేశామ‌ని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందులో 11 వేల కాంట్రాక్టు ఉద్యోగుల‌ను రెగ్యుల‌రైజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని ముఖ్యంత్రి కేసీఆర్ శాస‌న‌స‌భా వేదిక‌గా ప్ర‌క‌టించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. అయితే హోం, విద్య‌, వైద్యారోగ్య శాఖ‌లో భారీగా ఖాళీలు ఉన్నాయి. హోంశాఖ‌లో 18,334, సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌లో 13,086, హాయ్య‌ర్ ఎడ్యుకేష‌న్‌లో 7,878, వైద్యారోగ్య శాఖ‌లో 12,755 ఖాళీల‌కు నోటిఫికేష‌న్లు వెలువ‌డ‌నున్నాయి.

ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఉద్యోగ ఖాళీలు ఇలా ఉన్నాయి…

జిల్లాల వారీగా ఖాళీలు..
హైదరాబాద్ – 5,268
నిజామాబాద్- 1,976
మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769
రంగారెడ్డి- 1,561
కరీంనగర్- 1,465
నల్లగొండ- 1,398
కామారెడ్డి- 1,340
ఖమ్మం- 1,340
భద్రాద్రి కొత్తగూడెం- 1,316
నాగర్‌కర్నూల్- 1,257
సంగారెడ్డి- 1,243
మహబూబ్‌నగర్- 1,213
ఆదిలాబాద్- 1,193
సిద్దిపేట- 1,178
మహబూబాబాద్- 1,172
హనుమకొండ- 1,157
మెదక్- 1,149
జగిత్యాల- 1,063
మంచిర్యాల- 1,025
యాదాద్రి భువనగిరి- 1,010
జయశంకర్ భూపాలపల్లి- 918
నిర్మల్- 876
వరంగల్- 842
కుమ్రం భీం ఆసీఫాబాద్- 825
పెద్దపల్లి- 800
జనగాం- 760
నారాయణపేట్- 741
వికారాబాద్- 738
సూర్యాపేట- 719
ములుగు- 696
జోగులాంబ గద్వాల- 662
రాజన్న సిరిసిల్లా- 601
వనపర్తి- 556

క్యాడర్ వారీగా ఖాళీలు..
జిల్లాల్లాలో- 39,829
జోన్లలో- 18,866
మల్టీజోనల్‌ పోస్టులు- 13,170
సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147

గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు..
గ్రూప్‌ 1- 503 ఉద్యోగాలు
గ్రూప్‌ 2- 1,373 ఉద్యోగాలు
గ్రూప్‌ 4- 9168 పోస్టులు

Share this content:

You May Have Missed