దర్వాజ-హైదరాబాద్
Telangana CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆస్పత్రికి వెళ్లగా.. ఆయన కడుపులో చిన్నపాటి అల్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఏఐజీ ఆస్పత్రికి తీసుకువచ్చి సీటీ, ఎండోస్కోపీ చేశారు. కడుపులో చిన్న అల్సర్ ఉన్నట్లు గుర్తించామనీ, దీనిని వైద్యపరంగా చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు ఆదివారం ఉదయం కడుపునొప్పి రావడంతో ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ)కి తరలించారు. ఆదివారం ఉదయం సీఎం కేసీఆర్ కు కడుపునొప్పి రావడంతో వైద్యులు నాగేశ్వర్ రెడ్డి పరీక్షించారు. ఆయనను ఏఐజీ ఆస్పత్రికి తీసుకువచ్చి సీటీ, ఎండోస్కోపీ చేశారు. కడుపులో చిన్న అల్సర్ ఉన్నట్లు గుర్తించి వైద్యపరంగా చికిత్స అందిస్తున్నారు. వైద్య పరంగా ఇతర పారామీటర్లన్నీ నార్మల్ గానే ఉన్నాయి. తగిన చికిత్స ప్రారంభించామని ఆస్పత్రి తన బులెటిన్ లో పేర్కొంది.