Loading Now
raithu samburalu

ఘ‌నంగా రైతు సంబురాలు.. బండ‌లాగుడు పోటీలు.. భారీగా త‌ర‌లివ‌చ్చిన ప్ర‌జ‌లు !

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్‌

Telangana: రంగారెడ్డి జిల్లా త‌లకొండ‌ప‌ల్లి మండ‌లంలోని దేవుని పడకల్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మో త్సవాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. శ్రీదేవి , భూదేవి సమేతంగా వెల‌సిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్ర‌హ్మోత్స‌వ వేడుక‌లు వారం రోజుల పాటు ఘ‌నంగా జ‌రుగుతాయి. ఇక్క‌డ ప్ర‌తియేటా జ‌రిగే జాత‌ర‌కు పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు, భ‌క్తులు త‌ర‌లివ‌స్తారు. ఈ క్ర‌మంలోనే బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా దేవుని ప‌డ‌క‌ల్ లో రైతు సంబురాలు జ‌రిగాయి. గురువారం నాడు బండలాగుడు పోటీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పోటీలలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాలకు చెందిన ఏడు జతల ఎద్దులు పోటీలలో పాల్గొన్నాయి. ఈ బండలాగుడు పోటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి, ఆమనగల్ మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, జెడ్‌పీటీసీ ఉప్ప‌ల వెంక‌టేష్‌, ఎంపీపీ నిర్మ‌ల శ్రీశైలం, గ్రామ స‌ర్పంచ్ శ్రీశైలం, ఉప స‌ర్పంచ్ రాజ‌మోని తిరుప‌తి, రైతులు, పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

బండ‌లాగుడు పోటీలో భాగంగా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన మొత్తం ఏడు జ‌త‌ల ఎద్దులు పోటీలో పాల్గొన్నాయి. బాల‌కృష్ణ న‌టించిన అఖండ సినిమాలోని ఎద్దుల జ‌త సైతం ఈ పోటీలో పాల్గొని బ‌హుమ‌తి గెలుచుకుంది. ఈ పోటీలో టాప్‌-5 లో నిలిచిన ఐదు ఎద్దుల జోడీల‌కు బ‌హుమ‌తులు అందించారు. బండ‌లాగుడు పోటీలో పాల్గొన్న అన్ని జ‌త‌ల ఎద్దుల‌కు ప్రోత్సాహ‌క బ‌హుమ‌తులు అందించారు. బండ‌లాగుడు పోటీల‌కు మొద‌టి రెండు బ‌హుమ‌తులు కాసు శ్రీనివాస్ రెడ్డి (శ‌తాబ్ది టౌన్ షిప్ ప్ర‌యివేటు లిమిటెడ్‌ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌-రామ‌కృష్ణ‌పురం) అందించారు. మూడో బ‌హుమ‌తి ఈరెడ్డి యాద‌గిరి రెడ్డి (క‌డ్తాల్‌), నాల్గో బ‌హుమ‌తి డోకూరు ప్ర‌భాక‌ర్ రెడ్డి (మాదేష్ ట్రావెల్స్-ప‌డ‌క‌ల్‌), నాల్గొ బ‌హుమ‌తి ప‌డితెపురం యాద‌య్య (లింగ‌రావుప‌ల్లి), ఐదో బ‌హుమ‌తి జే.శ్రీశైలం (మాజీ ఉప స‌ర్పంచ్‌-ప‌డ‌క‌ల్) లు అందించారు.

దేవుని పడకల్ గ్రామంలో నిర్వహించిన బండలాగుడు పోటీల ఫొటోలు:

Share this content:

You May Have Missed