Breaking
Tue. Nov 18th, 2025

Telangana | పోటీ ప‌రీక్ష‌ల‌కు 900 మందికి ఉచితంగా కోచింగ్.. పూర్తి వివ‌రాలు ఇవిగో..

Telangana: Free coaching for 900 tribals for competitive exams
Telangana: Free coaching for 900 tribals for competitive exams

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Telangana: తెలంగాణ ప్ర‌భుత్వం భారీ ఎత్తున ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌బోతున్నామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయితే, నిరుద్యోగుల‌కు ఉచితంగా కోచింగ్ ఇవ్వ‌డానికి కూడా ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు చెందిన 900 మంది షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ను అందించనుంది.

త్వరలో జరగనున్న పోలీస్, గ్రూప్-1, గ్రూప్-IV పోటీ నియామక పరీక్షలకు పాత అవిభక్త ఖమ్మం జిల్లాలోని తొమ్మిది కేంద్రాలలో కోచింగ్ ఇవ్వ‌నున్నారు. భద్రాచలం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్‌ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ అవ‌కాశాన్ని నిరుద్యోగులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అధికారులు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల‌ని సూచిస్తున్నారు. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల రూపాయల లోపు ఉండాలి.

ప్ర‌భుత్వ నోటిఫికేష‌న్ ప్ర‌కారం.. అర్హత కలిగిన అభ్యర్థులు మెరిట్ ఆధారంగా స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ప్రోగ్రామ్‌కు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచితంగా భోజనం, వసతి, స్టడీ మెటీరియల్‌ కూడా అందజేస్తారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఉచిత కోచింగ్ ప్రోగ్రామ్ కోసం తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. మ‌రిన్ని వివరాల కోసం 7981962660/9550813062/8143840906 నంబర్లలో సంప్రదించండి.

వెబ్‌సైట్ : https://studycircle.cgg.gov.in/tstw/Index.do;jsessionid=86E4F30E7ACFB2C2E5AD8170A0E59EA9

Related Post