దర్వాజ-హైదరాబాద్
Telangana: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలోని నెల్లికుదురు మండలం ఆలేరు (Alair village) గ్రామానికి చెందిన 23 ఏండ్ల యువతి ఫిబ్రవరి 17న సామూహిక లైంగికదాడికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. మంగళవారం అర్థరాత్రి స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రిలో బాధితురాలు మృతి చెందింది. ఆస్పత్రిలోని ఆమె బెడ్‌పై పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను గుర్తించారు. అందులో ఆమె ఫిబ్రవరి 17 న ఒక పోలీసు కానిస్టేబుల్, ఒక MPTC భర్తతో సహా నలుగురు వ్యక్తులు తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడి.. హింసించారని ఆరోపించింది. బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడిన ఆరోపణలు వచ్చిన సదరు కానిస్టెబుల్ వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్నాడని సమాచారం.
తెలంగాణ టూడే పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన ఆ యువతి.. గ్రామంలోనే ఉంటూ.. మహుబాబాద్‌లో తరగతులకు హాజరవుతూ పోలీసు కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతోంది. బాధితురాలి తల్లి కొన్నేళ్ల క్రితం చనిపోగా, ఆమె తన తమ్ముడు.. లారీ డ్రైవర్ అయిన తండ్రితో కలిసి నివసిస్తున్నారు తనపై జరిగిన లైంగికదాడి (gang rape) నేపథ్యంలో మనస్థాపానికి గురైన బాధిత మహిళ ఫిబ్రవరి 18 న తన ప్రాణాలు తీసుకోవడానికి పురుగుల మందు తాగింది. ఈ క్రమంలోనే ఆమెను చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఇదిలావుండగా, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మహబూబాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్ కరుణాకర్ రావు తనను సంప్రదించిన మీడియా ప్రతినిధులకు తెలిపారు. అయితే, దీనిపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.
ప్రస్తుతం లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిందితుల్లో ఒకరైన ఆటోరిక్షా డ్రైవర్ గ్రామంలో బాధితురాలు ఉన్న ప్రాంతంలోనే నివసిస్తున్నాడు. మహిళ మృతితో గ్రామంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
Share this content: