Loading Now
Telangana Govt to Increase RTC Bus charges

Telangana RTC Charges | తెలంగాణ‌లో పెరిగిన ఆర్టీసీ చార్జీలు..

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

RTC Charges : ఇప్ప‌టికే పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ భారం నిత్యావ‌స‌రాల‌పై ప‌డి వాటి ధ‌ర‌లు కూడా పెర‌గ‌డంతో సామాన్య ప్ర‌జానీకంపై ఆర్థిక భారం ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే సామాన్యుడిపై మరింత భారం మోపింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌. రాష్ట్రంలో మ‌రోసారి ఆర్టీసీ చార్జీల‌ను పెంచింది. డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులకు రూ.2 పెంచారు. ఎక్స్ ప్రెస్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసులకు రూ.5 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బస్సు సర్వీసుల్లో కనీస టికెట్ ధర రూ.10గా నిర్ణయించారు. పెరిగిన ధరలు శ‌నివారం నుంచి అమల్లోకి వ‌స్తాయ‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఇప్ప‌టికే ధ‌ర‌ల పెరుగుద‌ల ప్ర‌భావం ఎదుర్కొంటున్న ప్ర‌యాణికులపై టిక్కెట్టు ధ‌ర‌ల భారం కూడా ప‌డ‌నుంది.

Share this content:

You May Have Missed