Breaking
Tue. Nov 18th, 2025

Telangana: మూడు రోజులు భారీ వ‌ర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ

Cloudy sky, Hyderabad, IMD, Rainfall, Telangana, మేఘావృతమైన ఆకాశం, హైదరాబాద్, ఐఎండీ, వర్షపాతం, తెలంగాణ,Karnataka , క‌ర్ణాట‌క‌,

దర్వాజ-హైదరాబాద్

Heavy rains-IMD issues red alert: తెలంగాణ‌లో మ‌రో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department – IMD) పేర్కొంది. ఈ క్ర‌మంలోనే రెడ్ అలర్ట్ ప్ర‌క‌టించింది. శ‌నివారం నాడు హైద‌రాబాద్ భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రించింది. సోమ, మంగళవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంద‌ని అంచనా వేసింది. “ఆగస్టు 8, 9 తేదీలలో తెలంగాణలోని ఈశాన్య, ఉత్తరం, పరిసర జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది” అని ఐఎండీ హెచ్చ‌రించింది. రాబోయే వారంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.

మొత్తం వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగానే ఉంటుందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) అంచనా వేసింది. ఆగ‌స్టు 8న తెలంగాణలోని 11 జిల్లాల్లో రెడ్ వార్నింగ్ జారీ చేసింది.

Related Post