దర్వాజ-హైదరాబాద్
Telangana High Court Notice to RBI Governor: మహేష్ బ్యాంక్ రుణ మోసం కేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కు తెలంగాణ హైకోర్టు సోమవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఉన్నతాధికారులు అక్రమంగా రుణాల పంపిణీ, ఇతర అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏప్రిల్ 24న తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ మహేష్ బ్యాంక్ పరిపాలన, రోజువారీ వ్యవహారాలను నిర్వహించడానికి ఒక అధికారిని నియమించడంలో ఆర్బీఐ విఫలం కావడంతో బ్యాంకు షేర్ హోల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే గతంలో కోర్టు సూచించినట్టు చర్యలు తీసుకోవడంతో ఆర్బీఐ విఫలం కావడంతో శక్తికాంత దాస్ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టకూడదో జూలై 7లోగా చెప్పాలని ఆర్బీఐ గవర్నర్ ను కోర్టు ఆదేశించింది. షేర్ హోల్డర్ల ప్రయోజనాల దృష్ట్యా విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఉన్న మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ పరిపాలన, రోజువారీ వ్యవహారాలను నిర్వహించడానికి తనకు నచ్చిన అధికారిని నియమించాలని కోర్టు గతంలో ఆర్బీఐని ఆదేశించింది. విధానపరమైన నిర్ణయాల కోసం సీనియర్ బ్యాంకు అధికారులను సంప్రదించాలని ఆదేశిస్తూ, వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి మరియు రోజువారీ కార్యకలాపాలను నడపడానికి ఈ చర్య అని కోర్టు తెలిపింది.