Loading Now
Andhra Pradesh, RRB , RRB exam , RRB exam candidates, Special trains, ఆంధ్రప్రదేశ్, ఆర్ఆర్‌బీ, ఆర్ఆర్‌బీ పరీక్ష , ఆర్ఆర్‌బీ పరీక్ష అభ్యర్థులు, ప్రత్యేక రైళ్లు, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, రైళ్లు ,

Hyderabad: న‌గ‌ర‌వాసుల‌కు గుడ్‌ న్యూస్‌.. MMTS ఛార్జీలు 50% తగ్గింపు.. !

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్
MMTS ticket fare: హైద‌రాబాద్ ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్) ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. న‌గ‌రంలోని ఎంఎంటీఎస్ ఛార్జీలను తగ్గిస్తున్న‌ట్టు వెల్ల‌డించింది. ఫస్ట్ క్లాస్‌ ఛార్జీలను దాదాపు 50 శాతం మేర తగ్గించారు. MMTS ఛార్జీలను మే 5 నుండి ఫస్ట్ క్లాస్ సింగిల్ జర్నీ ప్రయాణికులకు 50 శాతం వరకు త‌గ్గ‌నున్నాయి. SCR ఒక ప‌త్రిక ప్ర‌క‌ట‌న‌లో క‌రోనా నేప‌థ్యంలో విధించిన లాక్‌డౌన్ తర్వాత సేవలను తిరిగి ప్రారంభించినప్పటి నుండి దక్షిణ మధ్య రైల్వే సబ్-అర్బన్ ప్రయాణీకుల ప్రయోజనం కోసం MMTS సేవల సంఖ్యను క్రమంగా పెంచుతోంద‌ని తెలిపింది.

అలాగే, ఫలక్‌నుమా-సికింద్రాబాద్-హైదరాబాద్-బేగంపేట్-లింగంపల్లి-తేలాపూర్-రామచంద్రపురం విభాగాల్లో 29 రైల్వే స్టేషన్‌లను కవర్ చేస్తూ 50 కిలోమీటర్ల మేర 86 సర్వీసులు న‌డుపుతున్నామ‌ని వెల్ల‌డించింది. పీక్ అవ‌ర్ ట్రాఫిక్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప్రయాణీకుల ప్రయాణ అవసరాలను తీర్చే విధంగా స‌ర్వీసులు న‌డుపుతున్నామ‌ని SCR జనరల్ మేనేజర్ (ఇన్-ఛార్జ్) అరుణ్ కుమార్ జైన్ వెల్ల‌డించారు.

MMTS ఫస్ట్ క్లాస్‌లో తగ్గిన ఛార్జీల వివార‌లు ఇలా ఉన్నాయి..

Distance Slab (in km)Existing FareFrom May 5
1-10Rs 50Rs 25
11-15Rs 65Rs 35
16-25Rs 100Rs 55
26-35Rs 145Rs 85
36-45Rs 155Rs 90

Share this content:

You May Have Missed