Loading Now
darvaaja, Telugu news, Telugu News updates, తాజా వార్త‌లు, తెలుగు న్యూస్‌, ద‌ర్వాజ‌, KTR, CMDA, suspend, birthday memo, Bellampalli Municipal Council, Telangana, కేటీఆర్, సీఎండీఏ, పుట్టినరోజు మెమో, బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిల్, తెలంగాణ,కేసీఆర్‌,

Telangana: తెలంగాణ హ‌క్కుల కోసం కేంద్రంతో కొట్లాట‌కు సై !

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్
Telangana: బ‌డ్జెట్-2022 పార్ల‌మెంట్ స‌మావేశాలు (Parliament Budget session 2022) ప్రారంభం అయ్యాయి. ఈ క్ర‌మంలోనే పార్ల‌మెంట్ లో తెలంగాణ వాణిని బ‌లంగా వినిపించాల‌ని తెలంగాన పార్ల‌మెంట్ స‌భ్యులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం నాడు రాష్ట్రప‌తి ప్ర‌సంగాన్ని సైతం బ‌హిష్క‌రించారు. అయితే, కేంద్రం నుంచి తెలంగాణ‌కు అనుకున్న స్థాయిలో చేయూత ల‌భించ‌క‌పోవ‌డంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Kalvakuntla Taraka Rama Rao) మాట్లాడుతూ.. విభ‌జ‌న నేప‌థ్యంలో ప్ర‌స్తావించిన అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాల‌కు పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని ఆయ‌న డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజల హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం కొన‌సాగిస్తామ‌ని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల‌కు పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని ఆయ‌న డిమాండ్ చేశారు. గ‌త ఏడున్న‌రేండ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సహాయ, సహకారాలు అందడం లేదని తెలిపారు. అయితే, తెలంగాణ‌కు ద‌క్కాల్సిన న్యాయ‌మైన హ‌క్కుల‌ను, నిధుల‌ను కేంద్రంపై పోరు సాగించైనా సాధించుకుంటామ‌ని కేటీఆర్ అన్నారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యప‌డుతుంద‌ని కేంద్రాన్ని ప్రశ్నించారు. రాష్ట్రాల‌కు రావాల్సిన నిధుల‌ను విడుద‌ల చేయాల‌నీ, ప్ర‌త్యేక నిధులు సైతం చేటాయించాల‌ని పేర్కొన్నారు.

Share this content:

You May Have Missed