ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు కరోనా బారినపడగా.. తాజాగా ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే, కరోన జాగ్రత్తలు తీసుకోవాలనీ, కోవిడ్-19 పరీక్షలు సైతం చేయించుకోవాలన్నారు.