దర్వాజ-హైదరాబాద్
Telangana: తెలంగాణలో రానున్న ఐదు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. వాతావరణం చల్లబడటంతో పాటు ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుముఖం పడుతాయని వెల్లడించింది. తెలంగాణకు జూన్ 5 నాటికి రుతుపవనాలు వచ్చే అవకాశముందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం.. రానున్న ఐదు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముంది. దీంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడుతాయి. అలాగే, జూన్ 5న తెలంగాణలో రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త శ్రావణి తెలిపారు. “జూన్ 5న తెలంగాణలో రుతుపవనాలు వచ్చే అవకాశముంది. ఇదే సమయంలో రానున్న ఐదు రోజుల పాటు మొత్తం తెలంగాణాలో మోస్తారు వర్షపాతం ఉంటుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సినాప్టిక్ పరిస్థితి లేదు. ప్రధానంగా దిగువ స్థాయి బలమైన వెస్టర్లీలు రాష్ట్రంపై ప్రబలంగా ఉన్నాయి” అని శ్రావణి పేర్కొన్నారు.
Share this content: