Breaking
Tue. Nov 18th, 2025

Telangana | ఘోర రోడ్డు ప్ర‌మాదం… ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టులు మృతి

Two journalists lose lives in road accident
Two journalists lose lives in road accident

ద‌ర్వాజ‌-ఖ‌మ్మం

road accident: ఖ‌మ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు జ‌ర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వివ‌రాల్లోకెళ్తే.. జ‌ర్నలిస్టులు ఇద్ద‌రు వెళ్తున్న బైక్‌ను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఇద్దరు జర్నలిస్టులు దుర్మరణం పాలయ్యారు. బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ స‌మీపంలోని యర్రమ్మతల్లి ఆలయం వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతుడు ఆసిఫ్ పాషా (29), భీష్మారెడ్డి (34) అర్ధరాత్రి కొత్తగూడెం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ ప్ర‌మాదంతో ఆసిఫ్ అక్కడికక్కడే మృతి చెందగా, భీష్ముడు తీవ్రంగా గాయపడి ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారిద్దరూ వేర్వేరు ప్రాంతీయ వార్తాపత్రికల్లో పనిచేస్తున్నారు. మృతులు ఆశ్వాపురం మండలం అమ్మగారి పల్లి గ్రామానికి చెందిన వారని సమాచారం. కొత్తగూడెం నుంచి అశ్వాపురం వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

Related Post