దర్వాజ-శ్రీనగర్
Terror Attacks_Jammu and Kashmir: జమ్ముకాశ్మీర్‌లో స్థానికేతరులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. గత రెండు రోజుల్లో అక్కడ స్థానికేతరులపై మూడు చోట్లకు పైగా ఉగ్రదాడులు జరిగాయని అధికారులు పేర్కొంటున్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో బీహార్‌కు చెందిన కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరోకరు తీవ్రంగా గాయపడి.. ప్రాణాలతో పోరాడుతున్నాడు.
ఈ ఘటనకు ముందు కూడా స్థానికేతరులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. శనివారం చోటుచేసుకున్న ఘటనలో ఇద్దరు చనిపోవడంతో పాటు మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు బీహార్‌కు చెందిన వ్యాపారి, మరొకరు యూపీకి చెందిన వడ్రంగి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్థానికేతరుల కోసం ప్రత్యేకంగా భద్రతా చర్యలను తీసుకుంటోంది.
వైద్యురాలికి మత్తు మందు ఇచ్చి లైంగికదాడి చేసిన ఎయిమ్స్ డాక్టర్
కేరళను ముంచెత్తిన వరదలు.. 10 మంది మృతి
అంబరాన్నంటిన ‘బతుకమ్మ’ సంబురాలు
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 400 స్థానాలు గెలుస్తాం..
బాల్య వివాహాలు.. ఏటా 22 వేల మంది బాలికలు బలి