దర్వాజ-తిరుమల
Tirumala Sri Venkateswara Swamy Temple: వరుసగా పదమూడవ నెల కూడా తిరుమ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీకి రూ.120 కోట్లకు పైగా ఆదాయం రాగా, సగటున రోజుకు రూ.4 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. మార్చిలో హుండీకి రూ.120.29 కోట్ల ఆదాయం సమకూరిందని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.
20.57 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా, 38.17 లక్షల మంది ఉచిత భోజనాలు, 8.25 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. మొత్తం 1.02 కోట్ల లడ్డూలు అమ్ముడయ్యాయి. ఇదిలావుండగా, తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల సంఖ్య పెరగడంతో తిరుపతి ఆలయంలోని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే భక్తులు తమ దర్శనం విషయంలో ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.
Read More…
దంచికొట్టిన వర్షం.. తెలంగాణలో రెండు రోజులు ఆరెంజ్ అలర్ట్
బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత తనయుడు అనిల్.. ఏకే అంటోని రియాక్షన్ ఇదే.. !
కరోనా వైరస్ విజృంభణ.. భారీగా కొత్త కేసులు నమోదు
జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ మహ్తో మృతి