దర్వాజ | Darvaaja
Top 10 Most Powerful Countries in the World : ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు కేవలం సైనిక బలం మాత్రమే కాకుండా, ఆర్థిక వనరులు, రాజకీయ ప్రభావం, అంతర్జాతీయ సంబంధాలు వంటి అంశాల ఆధారంగా నిర్ణయించబడతాయి. తాజా అధ్యయనాల ప్రకారం 2024లో అత్యంత శక్తివంతమైన టాప్ 10 దేశాలు ఇవే:
అమెరికా (యునైటెడ్ స్టేట్స్): అత్యంత అధునాతన సాంకేతికత, సాంస్కృతిక పరిధి, $27.4 ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.
చైనా: 1.4 బిలియన్ల జనాభా, $17.8 ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.
రష్యా: భారీ భూభాగం, సహజ వనరులు, అధిక సైనిక శక్తితో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది.
యునైటెడ్ కింగ్‌డమ్: బ్రెక్సిట్ తర్వాత యూకే గ్లోబల్ ప్లేయర్‌గా కొనసాగుతోంది. లండన్ ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక కేంద్రాలలో ఒకటిగా ఉంది. యూకే ప్రపంచంలోని టాప్ 10 పవర్ ఫుల్ దేశాల్లో నాల్గో స్థానంలో నిలిచింది.
జర్మనీ: యూరోపియన్ యూనియన్‌లో అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, పరిశ్రమలో ప్రముఖంగా ఉంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల్లో టాప్ 5 స్థానంలో ఉంది.
ఫ్రాన్స్: బలమైన సైనిక శక్తి, సాంస్కృతిక ప్రభావం, యూరోపియన్ యూనియన్‌లో ఈ దేశ కీలక పాత్రతో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా కొనసాగుతోంది.
జపాన్: అధునాతన సాంకేతికత, ఆర్థిక శక్తి, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కీలక దేశంగా ఉన్న జపాన్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల్లో 7వ స్థానంలో ఉంది.
ఇండియా: వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, భారీ జనాభా, సైనిక శక్తి కలిగిన భారత్.. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ 8వ స్థానంలో ఉంది.
దక్షిణ కొరియా: సాంకేతికత, ఆర్థిక శక్తి, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కీలక దేశంగా ఉన్న సౌత్ కొరియా 9వ స్థానంలో ఉంది.
కెనడా: సహజ వనరులు, ఆర్థిక శక్తి, ఉత్తర అమెరికాలో కీలక దేశంగా ఉన్న కెనడా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల్లో 10 స్థానంలో ఉంది.
ఈ దేశాలు ప్రపంచంలో వివిధ రంగాలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. యావత్ ప్రపంచంపై త ప్రభావం చూపుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ ప్రభావం కొనసాగుతుంది.
Share this content: