Loading Now
తెలంగాణ, కేసీఆర్‌, కేసీఆర్ కుటుంబం, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌, ఎన్నారైలు, Telangana , KCR family, KCR , Revanth Reddy, TPCC, Congress , NRIs,

Telangana | 2 వేల కోట్ల ప్ర‌భుత్వ భూమిని ప్రైవేట్ వ్య‌క్తుల‌కు క‌ట్ట‌బెట్టిందెవ‌రు..? ప‌్ర‌భుత్వంపై రేవంత్ పైర్

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్‌

Revanth Reddy,: హైదరాబాద్‌లోని షేక్‌పేటలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.2000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. “ఈ ల్యాండ్ పార్శిల్ కేటాయింపు వెనుక ముఠా నాయకుడు ఎవరు? మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేసీ రామారావు (కేటీఆర్‌)కు తెలియకుండా 2000 కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం సాధ్యమేనా? అని ప్ర‌శ్నించారు. షేక్‌పేటలో సర్వే నంబర్ 357కి ఇచ్చిన లేఅవుట్ అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఆదేశాలు లేకుండా ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ సాహసించరని రేవంత్‌ రెడ్డి అన్నారు. విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపులో కింగ్‌పిన్ ఎవరో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలన్నారు.

Share this content:

You May Have Missed