దర్వాజ-న్యూఢిల్లీ
farm laws: కేంద్రంలోని ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన సమావేశంలో సాగు చట్టాల రద్దు బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ నెల 29 నుంచి జరుగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెడతారు. ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదిస్తే గతేడాది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు చట్టపరంగా రద్దుకానున్నాయి.
ఇదిలావుండగా, గతేడాది పార్లమెంట్ ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిపైగా దేశరాజధాని ఢిల్లీ సరిహద్దులో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోజురోజుకూ ఈ రైతు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ.. దేశవ్యాప్తంగా రైతు మహా పంచాయత్‌లను సైతం రైతు సంఘాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యలోనే రైతుల డిమాండ్లకు కేంద్రం దిగివచ్చింది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ ఇటీవల జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. మూడు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు.
అయితే, పార్లమెంట్‌లో నూతన సాగు చట్టాలను రద్దు చేసే వరకు దేశరాజధాని సరిహద్దులో తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. పంటకు కనీస మద్దతు ధర కల్పించే చట్టం సహా పలు డిమాండ్లతో తమ నిరసనలు కొనసాగుతాయని వెల్లడించాయి. ఆందోళన సందర్భంగా నిరసనకారులపై నమోదుచేయబడిన కేసులను సైతం ఉపసంహరించుకోవాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా, పలు రాష్ట్రాల్లో త్వరలో జరుగబోయే ఎన్నికల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ప్చ్.. సమంత చేసిన ఆ పనికి ఫ్యాన్స్ ఫైర్..
Katrina Kaif: ‘రోడ్లు.. కత్రీనా కైఫ్ బుగ్గల్లా నున్నగా ఉండాలి’
రైల్వే ట్రాక్ పక్కనే వీడియో కోసం.. కానీ అంతలోనే..
తొడ భాగంలో కొవ్వు కరగాలా? అయితే ఈ టిప్స్ పాటించండి..
కూలీ డబ్బులు అడిగితే చేయి నరికిన యజమాని
చల్లగాలి కోసం కారులోంచి తల బయటకు పెట్టింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Bigg Boss: బిగ్ బాస్ లీక్.. ఇంటి నుంచి ఈ వారం ఔట్ అయ్యేది..?