Breaking
Tue. Nov 18th, 2025

భారీ బృందంతో Paris Olympics 2024 కు భార‌త్..

Paris Olympics 2024

దర్వాజ-క్రీడ‌లు

Paris Olympics 2024 : ప్రపంచ క్రీడా స‌మ‌రానికి స‌ర్వం సిద్ధ‌మైంది. విశ్వ‌క్రీడ‌లకు (ఒలింపిక్స్) ఈ సారి పారిస్ వేదికైంది. పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వ‌ర‌కు కొన‌సాగే విశ్వ‌క్రీడ‌ల కోసం ఈ సారి భార‌త్ భారీ బృందాన్ని పంపుతోంది. గ‌త ఒలింపిక్స్ కంటే ఎక్క‌వ సంఖ్య‌లో ప‌త‌కాలు వ‌స్తాయ‌ని న‌మ్మ‌కంగా ఉంది. ఈ క్ర‌మంలోనే పారిస్ ఒలింపిక్స్ 2024 కోసం భారత సన్నాహాలను సమీక్షించడానికి కేంద్ర క్రీడా మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. భారతీయ అథ్లెట్లకు సహాయం చేయడానికి ఒక సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఈ బృందం భార‌త‌ అథ్లెట్‌కు అన్ని విధాలుగా మద్దతు అందిస్తూ అండ‌గా ఉంటుంది. ఒలింపిక్స్ పోటీల‌కు ముందు, పాల్గొనే స‌మ‌యంలో ఏదైనా స‌మ‌య‌స్యలు వ‌స్తే ఈ క‌మిటీ వారికి సహాయం అందిస్తుంది.

భారీ బృందంలో పారిస్ కు ప‌య‌నం

పారిస్ ఒలింపిక్స్‌లో 48 మంది మహిళా అథ్లెట్లతో సహా మొత్తం 118 మంది అథ్లెట్లు భార‌త్ త‌ర‌ఫున పాల్గొంటున్నారు. వీరు మొత్తం 16 క్రీడలలో పాల్గొంటారు. వీరిలో 26 మంది ఖేలో ఇండియా అథ్లెట్లు. 72 మంది అథ్లెట్లు తొలిసారిగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. సమీక్షా సమావేశంలో, అథ్లెట్లకు అవసరమైన సహాయాన్ని అందించడానికి అన్ని గ్రూపుల‌తో క‌లిసి ప‌నిచేయాల్సిన అవ‌స‌రాన్ని కేంద్ర మంత్రి మాండవ్య నొక్కిచెప్పారు. క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోడీ సందేశాన్ని పునరుద్ఘాటించారు.

యూరప్‌లోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ

ఇప్పటికే 80 శాతానికి పైగా అథ్లెట్లు యూరప్‌లోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొందుతుండ‌టం ప‌ట్ల సమీక్షా సమావేశంలో మాండవ్య సంతృప్తి వ్యక్తం చేశారు. దీని కారణంగా అక్కడి వాతావ‌ర‌ణ, ఇత‌ర ప‌రిస్థితుల నుంచి వారికి ప్ర‌తికూల ప‌రిస్థితులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ని తెలిపారు.

భారతీయ అథ్లెట్లకు TOPS తో సహాయం

కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) ద్వారా భారత క్రీడాకారులకు సహాయం చేస్తోందని క్రీడా మంత్రి తెలిపారు. “పారిస్ ఒలింపిక్స్‌కు మా అథ్లెట్లు సాధ్యమైనంత ఉత్తమమైన సన్నద్ధత సాధించగలరని నిర్ధారించడంతో పాటు వారి కోసం ప్రపంచ స్థాయి కోచ్‌లు, నిపుణులను నియమించార‌రు. ఒక క్రీడాకారుడు గాయపడితే, అతను కోలుకోవడానికి పూర్తి సహాయం అందిస్తారు” అని తెలిపారు. తొలిసారిగా భారత క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ విలేజ్‌లో స్పోర్ట్స్ సైన్స్ పరికరాలతో కూడిన రికవరీ సెంటర్ అందుబాటులోకి రానుందన్నారు. దీనితో పాటు, పారిస్‌లోని పార్క్ ఆఫ్ నేషన్స్‌లో ఇండియా హౌస్ ఏర్పాటు జ‌రిగింద‌నీ, ఇలాంటి వాటిని క‌లిగిన ఫ్రాన్స్‌తో సహా 14 ఇతర దేశాల లిస్టులో భారత్ చేరిందని తెలిపారు.

అవునా.. సమంతను కాకుండా నాగచైతన్య ఆ నటిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడా?

Related Post