Uttar Pradesh | పోలీసులపై ఐఐటీ గ్రాడ్యుయేట్ దాడి

UP: IIT Graduate attacks two policemen outside Gorakhnath Temple

ద‌ర్వాజ‌-ల‌క్నో

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని (యూపీ) గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయం వెలుపల ఆదివారం ఇద్దరు పోలీసులపై ఐఐటీ గ్రాడ్యుయేట్ దాడి చేశాడు. ఈ ఘటన‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. బాకులా కనిపించేదాన్ని ఓ ఆయుధాన్ని ప‌ట్టుకుని ఆ వ్య‌క్తి క‌నిపించాడు. మతపరమైన నినాదాలు చేస్తూ ఆలయంలోకి చొరబడేందుకు ప్రయత్నించాడు.

ఒక గుంపు దుండగుడిపై రాళ్లు విసరడం కనిపించింది. కొంత స‌మ‌యం త‌ర్వాత ప‌లువురు అత‌న్ని ప‌ట్టుకున్నారు. రాత్రి 7 గంటలకు ఆలయ ద్వారం బయట ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని అహ్మద్ ముర్తుజా అబ్బాసీగా గుర్తించారు. అహ్మద్ గోరఖ్‌పూర్ నివాసి మరియు 2015లో ఐఐటీ-బాంబేలో గ్రాడ్యుయేట్. అతని వద్ద ల్యాప్‌టాప్, ఫోన్ మరియు టికెట్ లభించాయి.

వ్యక్తి నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులు పెద్ద కుట్ర నాటకంలో ఉన్నట్లు క‌నిపిస్తున్నాయ‌నీ, దీనిని ఉగ్ర‌దాడికి సంబంధించిన నేప‌థ్యం క‌లిగిన అంశాన్ని కూడా ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు. దీనిపై పూర్తి స్తాయిలో ద‌ర్యాప్తు త‌ర్వాత పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు. గాయ‌ప‌డిన ఇద్ద‌రు పోలీసులు ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు.

Related Post