Breaking
Wed. Nov 19th, 2025

Uttar Pradesh: సామూహిక అత్యాచారం గురించి ఫిర్యాదు చేయ‌డానికి వెళ్తే.. బాధితురాలిపై పోలీసు అధికారి లైంగికదాడి..

rape, murder, Dalit sisters, Lakhimpur Kheri, Uttar Pradesh, police, అత్యాచారం, హత్య, దళిత సోదరీమణులు, లఖింపూర్ ఖేరీ, ఉత్తరప్రదేశ్, పోలీసులు,

దర్వాజ-లక్నో
Uttar Pradesh: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మ‌రోదారుణం చోటుచేసుకుంది. ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసే.. బాధితురాలిపై లైంగిక‌దాడి చేశారు. త‌న‌పై సామూహిక అత్యాచారం జ‌రిగింద‌ని బాధితురాలు త‌న బంధువుల‌తో క‌లిసి పోలీసు స్టేష‌న్ ఫిర్యాదు చేయ‌డానికి వెళ్ల‌గా.. బాధితురాలిని వేరే గదిలోకి తీసుకెళ్లిన స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. పోలీసులు వెల్లడించిన వివ‌రాల ప్ర‌కారం.. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు.. లైంగిక‌దాడికి గురైన బాధితురాలిపై స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. నలుగురు వ్యక్తులు తనపై సామూహిక‌ అత్యాచారం చేశారని యువతి పేర్కొంది. దీని గురించి పోలీసుల‌కు ఫిర్యాదు చేయడానికి బంధువుతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ తిలకధారి సరోజ్.. బాధితురాలిని వేరే గ‌దిలోకి తీసుకెళ్లి లైంగిక‌దాడి చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని సస్పెండ్ చేశారు. అత్యాచారానికి పాల్పడినందుకు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) సహా ఆరుగురిపై కేసు నమోదైంది.

Related Post