దర్వాజ-న్యూఢిల్లీ
Char Dham Yatra deaths : ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ యాత్రలో మొత్తం 91 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని శుక్రవారం నాడు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) హెల్త్ శైలజా భట్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది మే 3న చార్ ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 91 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. యాత్రలో మరణించిన వారిలో ఎక్కువ మంది గుండెపోటు కారణంగా చనిపోయారు. ఇంతకు ముందుతో పోలిస్తే.. యాత్ర మార్గంలో వైద్య సేవలు కాస్త మెరుగుపడ్డాయి అని తెలిపారు.
కాగా, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సమక్షంలో అక్షయ తృతీయ సందర్భంగా మే 3న భక్తుల కోసం గంగోత్రి మరియు యమునోత్రి పోర్టల్‌లను తెరవడంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. మే 6న కేదార్‌నాథ్ తెరుచుకోగా, మే 8న బద్రీనాథ్ తలుపులు తెరుచుకున్నాయి. చార్ ధామ్ యాత్ర మార్గంలో భక్తుల కోసం ప్రయివేటు హెల్త్ ఆర్గనైజేషన్ అందించే ఉచిత ఆరోగ్య సేవలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోమవారం (మే 2) జెండా ఊపి ప్రారంభించారు.
Share this content: