దేవుని పడకల్ లో ఓపెన్ టు హాల్ మెన్స్, ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్

volleyball-league-open-to-all-mens-and-womens-volleyball-tournament-at-devanipandakal

ద‌ర్వాజ‌-రంగారెడ్డి

Volleyball League: శ్రీ‌వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా త‌ల‌కొండ‌ప‌ల్లి మండల పరిధిలోని దేవునిపడకల్ గ్రామంలో మంగ‌ళ‌వారం నాడు ఓపెన్ టు హాల్ మెన్స్, ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభ‌మైంది. రెండు రోజుల పాటు ఈ టోర్న‌మెంట్ కొన‌సాగింది.

ఓపెన్ టు హాల్ మెన్స్, ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్ మహిళ విభాగంలో S A T S జట్టు మొదటి బహుమతి గెలుచుకోగా.. హైదరాబాద్ BHEL జట్టు రెండో బహుమతి గెలుచుకుంది. మూడో బహుమతి హకీంపేట్ జట్టు మూడో బహుమతి గెలుచుకుంది.

volleyball-tournament-at-devanipandakal-1024x576 దేవుని పడకల్ లో ఓపెన్ టు హాల్ మెన్స్, ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్

ఇక పురుషుల విభాగంలో చెట్టుపల్లి సత్యం టీమ్ మొదటి బహుమతి, S A T S టీమ్ రెండో బహుమతి గెలుచుకున్నాయి. మూడో బహుమతి వికారాబాద్ జట్టు గెలుచుకుంది. బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అమన్ గల్ సీఐ జే.ఉపేంద‌ర్ రావు, అమ‌న్‌గ‌ల్ ఎస్సై ధ‌ర్మేష్‌, త‌ల‌కొండ‌ప‌ల్లి ఎస్సై శివ శంక‌ర వ‌ర ప్ర‌సాద్‌, వాలీబాల్ యూత్ ప్రెసిడెంట్ K మల్లేష్, వైస్ ప్రెసిడెంట్ ఆర్‌. తిరుప‌తి, త‌ల‌కొండ‌ప‌ల్లి మండ‌ల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుమ్మరి శంకర్, డోకూరి ప్రభాకర్ రెడ్డి, గుజ్జరీ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related Post