హైద‌రాబాద్ ను వ‌ణికిస్తున్న నోరోవైరస్ ల‌క్ష‌ణాలేంటి? ఎలా వ్యాపిస్తుంది? ఎలా గుర్తించాలి?

Norovirus , Hyderabad

దర్వాజ-హైదరాబాద్

నోరోవైరస్ అనేది చాలా వేగంగా వ్యాప్తిచెందే అంటు వైర‌స్. ఇది కడుపు, ప్రేగులపై ప్ర‌భావం చూపి వాటి వాపు, గ్యాస్ట్రోఎంటెరిటిస్ కు కారణమవుతుంది. గ‌త రెండుమూడు వార‌ల నుంచి హైద‌రాబాద్ న‌గ‌రంలో నోరో వైర‌స్ కేసులు ఆందోళ‌న‌క‌రంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజూ 100కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని వైద్య నివేదిక‌లు పేర్కొంటున్నాయి. నోరోకేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌టంపై వైద్య నిపుణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

నోరోవైరస్ అంటే ఏమిటి?

నోరోవైరస్ అనేది అత్యంత వేంగంగా వ్యాపించే అంటువ్యాధి వైరస్. ఇది క‌డుపుతో పాటు ఇత‌ర శ‌రీర అవ‌య‌వాల‌పై తీవ్రంగా ప్ర‌భావం చూపుతుంది. నోరో వైర‌స్ కడుపు, ప్రేగులపై ప్ర‌భావం చూపి వాపును కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు ప్రధాన కారణం ఈ వైర‌స్ అని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం పేర్కొంది. దాని ప్ర‌కారం.. వైరస్ అకస్మాత్తుగా అతిసారం, తీవ్రమైన వాంతులు కలిగిస్తుంది. ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డ‌వారికి ప్రాణాపాయం లేక‌పోయినా.. కొద్ది రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వ‌స్తోంది. అయితే, చిన్నపిల్లలు, వృద్ధులతో సహా బలహీనమైన లేదా బ‌ల‌మైన రోగనిరోధక వ్యవస్థ లేని వ్యక్తులపై ఈ వైర‌స్ తీవ్రంగా ప్ర‌భావితం చేస్తోంది.

నోరో వైరస్ లక్షణాలు ఏమిటి?

మాయో క్లినిక్ నివేదిక‌ల ప్ర‌కారం… నోరోవైర‌స్ ఒక‌రినుంచి మ‌రొక‌రికి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన 12-48 గంటల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. రోగి రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యంపై ఆధారపడి కోలుకోవడంతో 24-72 గంటల వరకు కొనసాగవచ్చు. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా లేనివారిపై తీవ్రంగా ప్ర‌భావం చూపుతుంది. లక్షణాలు తీవ్రమైన విరేచనాలు, వికారం, తరచుగా వాంతులు, నిర్జలీకరణం, కడుపు తిమ్మిరి, చలి, అలసట, శరీర నొప్పులతో కూడిన అధిక జ్వరం ఉంటుంది. క‌డుపులో నొప్పి మొద‌ట‌గా క‌నిపించే ల‌క్ష‌ణంగా ఉండ‌వ‌చ్చున‌ని వైద్య నివేదిక‌లు పేర్కొంటున్నాయి.

నోరోవైరస్ ఎలా వ్యాపిస్తుంది?

నోరోవైరస్ స‌రైన‌ పరిశుభ్రత, పారిశుధ్యం లేని ప్రాంతాల్లో వృద్ధి చెందుతుంది. అంటే ఎక్కువ‌గా మురికిగా ఉండే, మురుగు నీరు పారే, శుభ్ర‌త‌లేని ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతుంది. ప్రధానంగా కలుషితమైన ఆహారం, నీరు లేదా ఉపరితలాల ద్వారా వ్యాపిస్తుంది. ఇది సోకిన వ్యక్తి పట్టుకున్న వ‌స్తువుల ద్వార కూడా ఇది మ‌రొక‌రికి సోకుతుంది. అలాగే, వైర‌స్ సోకిన వారితో కరచాలనం, వారికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం వ‌ల్ల కూడా వ్యాపిస్తుంది. వైరస్ అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధికి కార‌ణంగా ఉంటుంది. అంటే వైరస్ కలిగి ఉన్న ఏరోసోలైజ్డ్ కణాలు గాలిలోకి వెళ్లిన‌ప్పుడు అవి ఇత‌రులు పీల్చుకోవ‌డం ద్వార కూడా నోరో వైర‌స్ ఇత‌రుల‌కు సోకే అవ‌కాశ‌ముంది.

నోరోవైరస్ నివారణ చిట్కాలు ఏమిటి?

1. నోరోవైర‌స్ ఎక్కువ‌గా అప‌రిశుభ్ర ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతుంది. కాబ‌ట్టి మెరుగైన పరిశుభ్రత చర్యలను పాటించడం ద్వారా నోరోవైరస్ ను సులభంగా నివారించవచ్చు.

2. నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్ర‌కారం.. మీ చేతులను సబ్బు, నీటితో తరచుగా కడగడం ద్వారా మంచి చేతుల పరిశుభ్రతను కాపాడుకోవడం మిమ్మల్ని, ఇతరులను నోరోవైరస్ నుండి రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం అని పేర్కొంది.

3. నోరో వైర‌స్ సోకిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాల‌కు దూరంగా ఉండాలి.

4. ఆహారం కలుషితం అయింద‌నిపిస్తే దానిని తీసుకోకుండా ఉండాలి. మీకు అనారోగ్యం, సంబంధిత ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వైర‌స్ వ్యాప్తిని నిరోధించడానికి ఆహారం త‌యారీకి దూరంగా ఉండాలి.

5. ముఖ్యంగా కిచెన్‌లు, బాత్‌రూమ్‌ల వంటి అధిక వైర‌స్ వ్యాప్తి ప్రమాదం ఉన్న ప్రదేశాలను క్ర‌మం త‌ప్ప‌కుండా క్రిమిసంహారకాల‌తో శుభ్రం చేసుకోవాలి.

6. పండ్లు, కూరగాయలను పూర్తిగా కడగాలి. పచ్చి లేదా వండని ఆహార పదార్థాల వినియోగాన్ని త‌గ్గించుకోవ‌డంతో నోరోవైర‌స్ వ్యాప్తిని నివారించ‌వ‌చ్చు.

7. నోరోవైర‌స్ వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాలి.

Read More

హైద‌రాబాద్ పై కొత్త వైరస్ అటాక్.. రోజుకు వంద కేసులు.. హెల్త్ ఎమ‌ర్జెన్సీ రానుందా?

కేంద్ర బడ్జెట్ 2024-25: కొత్త పన్ను విధానంలో మార్పులు..

Budget 2024-25 Highlights: బడ్జెట్‌లో ముఖ్యాంశాలు.. ఏ రంగానికి ఎంత కేటాయించారంటే?

తెలంగాణ బడ్జెట్ 2024-25 : రూ. 75,577 కోట్లకు చేరిన రాష్ట్ర అప్పు

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయాన్ని నిరసిస్తూ అసెంబ్లీ తీర్మానం

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం : సీఎం రేవంత్ రెడ్డి

Related Post