Loading Now
WhatsApp to go ahead with new privacy policy

వాట్సాప్ లో ఇక మెసేజ్ చేయలేరు !

– ప్రైవ‌సీ పాల‌సీకి యూజ‌ర్లు అంతా అనుమ‌తి ఇవ్వాల్సిందే..

– వాట్సాప్ యాజ‌మాన్యం

వాట్సాప్ (whatsapp) ప్రైవ‌సీ లొల్లి రోజుకో రూపం దాల్చుతుంది. దీనిపై మ‌న ప్ర‌భుత్వం, సుప్రీం కోర్టు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా కానీ వాట్సాప్ మాత్రం త‌మ పంతాన్ని నెగ్గించుకునేందు ప్ర‌య‌త్నం చేస్తుంది. ప్రైవసీ పాలసీకి యూజర్లు అంగీకరించాల్సిందేనని తేల్చి చేప్పేస్తోంది. మే 15న నుంచి ఈ కొత్త ప్రైవ‌సీ పాల‌సీని అమలు చేయనున్నట్లు వాట్సాప్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఈ నిబంధ‌న‌ను ఉప‌యోగించుకుని ప్రైవేటు మెసేజ్‌లు, వీడియోలను చూడ‌బోమ‌ని పేర్కొంటోంది.

ఈ ప్రైవ‌సీ పాల‌సీలో కేవలం వాట్సాప్ బిజినెస్‌ ఖాతాలకు సంబంధించిన డేటాను మాత్రమే సేకరించ‌నున్న‌ట్లు పేర్కొంది. అది కూడా యూజర్ అనుమతితోనేన‌ని తెలిపింది. అలా సేక‌రించిన డాటాను ఫేస్ బుక్ తో షేర్ చేస్తామని తెలిపింది. అలాగే ఈ పాల‌సీ గురించి త‌మ యూజ‌ర్ల‌కు స‌మాచారాన్ని ఇవ్వాల‌ని వాట్సాప్ నిర్ణయించింది. ఈ నిబంధనలను ఇన్‌-యాప్ బ్యానర్‌గా ఉంచాల‌ని యోచిస్తోంది.

మ‌న దేశ చట్టాలకు లోబ‌డే ప‌ని చేయ‌నున్న‌ట్లు కేంద్రానికి వాట్సాప్ తెలియ‌జేసింది. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను కూడా విడుద‌ల చేసింది. మే 15 నుంచి ఈ ప్రైవసీ పాలసీ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని తెలిపింది. ఈ ప్రైవసీ పాలసీకి సంబంధించిన సమాచారాన్ని బ్యానర్‌ రూపంలో యూజర్‌కు కనిపించేలా ఉంచ‌నున్న‌ట్లు పేర్కొంది. ఈ ప్రైవసీ పాలసీని అంగీకరించని వారికి మే 15 తర్వాత కూడా మాములుగానే కాల్స్‌, నోటిఫికేషన్స్ వ‌స్తాయట‌. కానీ వారు ఎలాంటి మెసేజ్ ల‌ను చేయ‌లేర‌ట‌. దీన్ని వాట్సాప్ బ‌ల్ల‌గుద్ది చెబుతోంది.

ఇక బిజినెస్ ఖాతాల విష‌యానికి వ‌స్తే.. ఆ సమాచారాన్ని వారి అనుమ‌తితోనే.. ఫేస్ బుక్ తో పంచుకుంటామ‌ని చెబుతోంది. వ్యక్తిగత సంభాషణలకు ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ ఉంటుంద‌ని తెలిపింది. వాటిని ఎన్న‌టికి చ‌ద‌వ‌డం, విన‌డం వంటి ప‌నుల‌ను వాట్సాప్ చేయ‌లేద‌ని.. ఇక ముందు కూడా అలాంటి ప‌నులు చేయ‌బోద‌ని చెబుతోంది.

అయితే కొన్ని రోజుల ముందు అనుహ్యంగా ముందుకు వ‌చ్చిన ఈ ప్రైవ‌సీ ప‌ల‌సీపై ప‌లువురు ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. అయితే ఆ విమ‌ర్శ‌ల్లో కూడా వ‌స్తవం ఉంది. యూజ‌ర్ల‌ డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకోవ‌డమే ఈ పాల‌సీలో భాగమని తేల్చి చెప్ప‌డ‌మే ఈ విమ‌ర్శ‌ల‌కు ప్ర‌ధాన కారణం. దాంతో ఎంతో మంది వాట్సాప్ ను ప్రైమ‌రీ యాప్ నుంచి సెకండ‌రీ యాప్ గా మార్చుకున్నారు. అలాగే అప్పుడే వ‌చ్చిన సిగ్న‌ల్ కు, టెలిగ్రామ్ కు మారిపోయారు. దీంతో వాట్సాప్ షాక్ కు గుర‌య్యింది. చేసేదేమీ లేక దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు పూనుకుంది. అయినా కానీ పెద్ద‌గా ప్ర‌యోజ‌నం క‌లుగ లేద‌ని చెప్పాలి.

11136677899 వాట్సాప్ లో ఇక మెసేజ్ చేయలేరు !

ఇలా యాప్ నుంచి వెళ్లిపోతున్న యూజ‌ర్ల విష‌యంలో వాట్స‌ప్ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఏ యాప్ వాడాల‌నేది యూజ‌ర్ల ఇష్ట‌మంటునే.. ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ లేకుండా యూజర్స్ ల‌ను చాలా యాప్స్ మోసం చేస్తున్నాయని పేర్కొంది. దీని గురించి యూజ‌ర్లు ఆలోచించాల‌ని తెలిపింది. వాట్సాప్ ఎప్పుడు న‌మ్మ‌కంగా ఉంటుంద‌ని.. భద్రతకు ప్రాధాన్యం ఇస్తుంద‌ని తెలిపింది.

అయితే వాట్సాప్ కొత్త ప్రైవ‌సీ పాల‌సీలు యూరప్ దేశంలో ఒక‌లా ఉంటే.. మ‌న దేశంలో మరోలా ఉన్నాయని కొంద‌రు సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచారణ సుప్రీం ధర్మాసనం విచార‌ణ చేప‌ట్టింది. మ‌న దేశంలో డబ్బు కంటే వ్యక్తిగత గోప్యతకే ప్రజలు ఎక్కువ విలువిస్తారని సుప్రీం పేర్కొంది. వాట్సాప్ ట్రిలియన్ల విలువున్న కంప‌నీ అయిన‌ప్ప‌టికీ గోప్య‌త‌ను కాప‌డ‌టంలో వెనుకంజ వేయొద్ద‌ని సూచించింది.

దీనిపై అప్ప‌ట్లో తమ వైఖరి తెలియజేయాలని వాట్సాప్‌కు, కేంద్రానికి నోటీసులు సుప్రీం కోర్టు జారీ చేసింది. అలాగే ప్రైవసీ పాలసీలో మార్పులు చేయొద్ద‌ని వాట్సాప్‌ను కేంద్రం ఆదేశించింది. ఇలా ఏక‌ప‌క్షంగా మార్పులు చేయొద్ద‌ని సూచించింది. దీనిపై స్పంధించిన వాట్సాప్.. భారతీయ చట్టాలకు లోబ‌డే ప‌ని చేస్తామ‌ని పేర్కొంది. ఇలా వ‌చ్చిన కొత్త ప్రైవసీ పాలసీ జనవరిలోనే అమ‌లు కావాలి. కానీ తీవ్ర అసంతృప్తి రావ‌డంతో దాన్ని వాట్సాప్ కొన్ని దినాలు వాయిదా వేసింది. మ‌ళ్లీ దాన్ని తెర మీద‌కు తీసుకు రావాల‌ని చూస్తోంది. అయితే ఈసారి కూడా మ‌ళ్లీ వాయిదా వేస్తుందా.. లేక అనుకున్న దాన్ని చేస్తుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా కానీ వాట్సాప్ కు ఈ నిబంధ‌న‌ల వ‌ల‌న న‌ష్ట‌మే జ‌రిగింద‌ని ప‌లువురు నిపుణులు చెబుతున్నారు.

దేశంలో పెట్రో మంట‌లు.. వరుస‌గా 12వ రోజు పెరిగిన ధ‌ర‌లు

మేడారం జాతర‌కు వేళాయ‌రా..!

మ‌రో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు వ‌ర్షాలు!

Share this content:

You May Have Missed