Breaking
Tue. Nov 18th, 2025

WhatsApp: షాకిచ్చిన వాట్సాప్.. 18 లక్షల ఖాతాలు బ్యాన్ !

WhatsApp : 18 lakh Indians' WhatsApp accounts banned!

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్‌

WhatsApp accounts banned : ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఇండియ‌న్ యూజ‌ర్స్ కు షాక్ ఇచ్చింది. ఏకంగా 18 ల‌క్ష‌ల భార‌తీయుల అకౌంట్స్ బ్యాన్ చేసింది. మార్చిలో భారతదేశంలో దాదాపు 18 లక్షల ఖాతాలను నిషేధించినట్లు కంపెనీ లేటెస్ట్ రిపోర్ట్ పేర్కొంది. కొత్త IT రూల్స్ 2021కి అనుగుణంగా, WhatsApp ఈ ఏడాది మార్చి 1 మరియు మార్చి 31కి సంబంధించి వాట్సాప్ త‌న నెల‌వారీ నివేదిక‌ను విడుద‌ల చేసింది. దాని ప్ర‌కారం.. మొత్తం 18 ల‌క్ష‌ల ఖాతాలు నిషేధించారు. ఫిబ్రవరి నుండి నిషేధించబడిన దాదాపు 8 లక్షల ఖాతాలు కూడా ఇందులో ఉన్నాయి. అంతకుముందు నెలలో, వాట్సాప్ దేశంలో దాదాపు 10 లక్షల ఖాతాలను నిషేధించింది. ఆయా ఖాతాలు దుర్వినియోగం అవుతున్నాయ‌ని గుర్తించిన ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఇదివ‌ర‌కు తెలిపింది.

“IT రూల్స్ 2021కి అనుగుణంగా, తాజా నివేదిక‌ను ప్ర‌చురించామ‌ని వాట్సాప్ పేర్కొంది. ఖాతాల‌పై త‌మ‌కు అందిన స‌మాచారం, భ‌ద్ర‌త విష‌యంలో వ‌చ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో ఖాతాల నిషేధ నిర్ణ‌యం ఉంద‌ని వాట్సాప్ ప్ర‌తినిధి తెలిపారు. బ్యాడ్ అకౌంట్స్ గా పిలవబడే ఈ ఖాతాలు వేధింపులు, నకిలీ సమాచారాన్ని ఫార్వార్డ్ చేయడం, ఇతర వినియోగదారులను మోసగించడం స‌హా మరిన్ని హానికరమైనటు వంటి కార్యకలాపాలలో పాల్గొన్నందుకు నిషేధించ‌బ‌డ్డాయి.

 WhatsApp: షాకిచ్చిన వాట్సాప్.. 18 లక్షల ఖాతాలు బ్యాన్ !
Provided by
google-news-tolivelugu WhatsApp: షాకిచ్చిన వాట్సాప్.. 18 లక్షల ఖాతాలు బ్యాన్ !

Related Post