Breaking
Tue. Nov 18th, 2025

Tamil Nadu: వితంతువుపై సామూహిక అత్యాచారం..

Pregnant woman, Pakistan, Punjab, police, sexually assaulting, Jhelum city, husband, గర్భిణి, పాకిస్థాన్, పంజాబ్, పోలీసులు, లైంగిక వేధింపులు, జీలం నగరం, భర్త,

ద‌ర్వాజ‌-చెన్నై

Tamil Nadu: దేశంలో నిత్యం ఏదో ఒక‌చోట మ‌హిళ‌ల‌పై హింస‌, లైంగిక‌దాడులు, అఘాయిత్యాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే 29 ఏండ్ల ఓ వితంతువుపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. ఆమెను దారుణంగా కొట్టి.. ద‌గ్గ‌ర వున్న న‌గ‌లు డ‌బ్బు దొచుకున్నారు. ఈ మొత్తం నేరాన్ని నిందితులు వీడియో తీశారు. ఈ దారుణ ఘ‌ట‌న త‌మిళనాడులో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకెళ్తే.. తమిళనాడులోని నమక్కల్‌లో 29 ఏళ్ల వితంతువు మే 19న వీశానం సరస్సు సమీపంలో తన స్నేహితుడితో కలిసి ఉండగా నలుగురు వ్యక్తులు వారి వ‌ద్ద‌కు వ‌చ్చారు. వారిని చుట్టుముట్టి దోచుకున్నారని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె 12 గ్రాముల బంగారు గొలుసు ధరించాన‌ని చెప్పింది. అంత‌టితో ఆగ‌కుండా దుండ‌గులు ఆమెపై దాడి చేసి, ఏకాంత ప్రాంతానికి తీసుకెళ్లి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని రికార్డు చేశారు. ఎవ‌రికైనా చెబితే ప్రాణాలు తీస్తాం.. అంటూ బెదిరించారు. బాధితురాలు నమక్కల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదుచేసుకునీ, న‌లుగురు నిందితులు నవీన్‌కుమార్‌ (21), దినేష్‌కుమార్‌ (21), మురళిని పోలీసులు అరెస్టు చేశారు.

Related Post