Breaking
Tue. Nov 18th, 2025

UP Election 2022: ప్ర‌త్యేక జాబ్ క్యాలెండ‌ర్ తీసుకువ‌స్తాం: ప్రియాంక గాంధీ

Priyanka Gandhi-Congress
Priyanka Gandhi-Congress

UP Assembly Election 2022: త‌్వ‌ర‌లోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్‌, మ‌ణిపూర్‌, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు (Assembly Election-2022) జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముమ్మ‌రంగా కొన‌సాగిస్తోంది. సోమ‌వారం నాడు కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) నోయిడాలో ఇంటింటి ప్ర‌చారం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌నీ, వివిధ ఉద్యోగాల కోసం ప్ర‌త్యేకంగా జాబ్ క్యాలెండ‌ర్ (job calendar) ను తీసుకువ‌స్తామ‌ని వెల్ల‌డించారు. జాబ్ క్యాలెండ‌ర్ కు సంబంధించిన అన్ని వివ‌రాలు ముందుగానే వెల్ల‌డిస్తామ‌నీ, ఉద్యోగాలు ఎలా కల్పిస్తామో అన్నది కూడా చెబుతామ‌ని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పేర్కొన్నారు.


రాష్ట్రంలోని అధికార పార్టీ బీజేపీపై ఆమె విమ‌ర్శ‌లు గుప్పించారు. కాగా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్‌, మ‌ణిపూర్‌, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు (Assembly Election-2022) ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గ‌నున్నాయి. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.

Related Post