దర్వాజ-క్రైమ్
భార్యా భర్తల బంధం ఎంతో పవిత్రమైంది. వీళ్ల మధ్య ఎన్ని కొట్లాటలు, పీకులాటలు వచ్చినా.. క్షణాల్లోనే మళ్లీ మామూలైపోవడం సర్వ సాధారణం. కానీ కొందరు భర్యా భర్తలు మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు. అందులోనూ ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు ఎక్కువయ్యాయి. తమ భాగస్వాములను అడ్డుగా భావించి చంపడానికి కూడా వెనకాడటం లేదు. ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని పాల్వంచలో జరిగింది.

ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నకుమార్ కు మొదటగా ఒక మహిళతో వివాహం అయ్యింది. ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వదిలేశాడు. ఆ తర్వాత ఇంకో యువతి గోపికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారి మధ్య గొడవలేమీ లేకపోయినా ఆ వ్యక్తి రెండో భార్యను కూడా వదిలేసి ఇంకో యువతితో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గోపికకు తెలిసి నిలదీసింది. దాంతో కుమార్ తమ బంధానికి అడ్డుగా వస్తుందని గోపికను చంపాలని ప్లాన్ చేశాడు.
చేతులకు మట్టి అంటకుండా మట్టుపెట్టాలని క్షుద్రపూజలతో ఆమెను చంపాలనుకున్నాడు. ఈ విషయం బాధితురాలికి తెలియడంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేధన వ్యక్తం చేస్తోంది. సొంత భార్యనే హత మార్చాలనుకున్న కుమార్ పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత మహిళకు అండగా నిలిచారు. ఇకనైనా పోలీసులు స్పందించి కుమార్ ను అరెస్ట్ చేయాలని కోరుతున్నారు.
భారత పౌరసత్వానికి 6 లక్షల మంది గుడ్బయ్ !
ఏమయ్యా రణ్ బీర్.. లెహంగ పొడవుగా ఉంటే అలా చేయాలా.. అయినా నీకెందుకంత పొగరు .?
ఏంజెల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?
వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?
Omicron: ఒమిక్రాన్.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి
చర్చ లేకుండానే.. సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్సభ ఆమోదం
MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్
ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?