- కరోనాను మించిన “సైలెంట్ కిల్లర్”
- దేశంలో ఏటా 40 వేల మందిని బలి తీసుకుంటున్న టీబీ (క్షయ వ్యాధి)
- ప్రపంచవ్యాప్తంగా నిత్యం 4000 మంది మృతి
యావత్ ప్రపంచం నేడు కరోనా వైరస్ గురించి చర్చించుకుంటోంది. తన ప్రభావాన్ని మొదలు పెట్టిన ఏడాది లోపే యావత్ ప్రపంచానికి వ్యాపించి.. లక్షలాది మందిని బలి తీసుకుంటోంది. కోట్లాది మందిని అనారోగ్యాన్ని గురిచేస్తోంది. అయితే, కరోనా వైరస్ ను మించి మరో సైలెంట్ కిల్లర్ ప్రపంచవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపుతోంది. ప్రతియేడాది లక్షలాది మందిని బలితీసుకుంటోంది. దాదాపు ప్రతి సంవత్సరం ఐదు లక్షల మంది దీని కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ సైలెంట్ కిల్లరే టీబీ (క్షయ వ్యాధి).
నేడు అంతర్జాతీయ టీబీ దినోత్సవం

1882, మార్చి 24న డా. రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త క్షయ వ్యాధికారక సూక్ష్మక్రిములను మొదటిసారిగా కనుగొన్నాడు. 1982లో అంతర్జాతీయ క్షయ, ఊపిరితిత్తుల వ్యాధుల వ్యతిరేక యూనియన్.. రాబర్ట్ కోచ్ క్షయ వ్యాధికారక సూక్ష్మక్రిములను కనుగొని 100 సంవత్సరాలైన సందర్భంగా మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించింది. దీనిలో భాగంగా మార్చి 24న నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో ర్యాలీలు నిర్వహించడం, వ్యాధి లక్షణాలు, దాని తీవ్రత తగ్గించేందుకు మందులు ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేసే శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పించడం జరుగుతోంది.
సైలెంట్ కిల్లర్ టీబీ
టీబీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిత్యం 4000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) డేటా పేర్కొంది. అలాగే, రోజు 28 వేల మంది దీని బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కోట్లల్లో యాక్టివ్ టీవీ కేసులు ఉన్నాయి. టీబీ ప్రభావం అధికంగా ఉన్న దేశాల జాబితాలో ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, ఫిలిప్పిన్స్, ఇండియా లు ముందువరుసలో ఉన్నాయి.

భారత్ లోఏటా 4 లక్షల మరణాలు
ఇక ప్రపంచంలో మొత్తం టీబీ కేసుల్లో 25 శాతం భారత్ లో ఉన్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరణాల విషయంలో మాత్రం భారత్ టాప్ లో ఉంది. దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 4 లక్షల మంది టీబీ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని డబ్ల్యూహెచ్ వో రిపోర్టులు పేర్కొంటున్నాయి. అంటే రోజుకు దేశంలో 1000 మందికి పైగా టీబీ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా కాలంలో దీని ప్రభావం మరింతగా పెరిగిందని ఇటీవలే వెలువడిని పలు సర్వేలు అధ్యనాలు తెలిపాయి. దీనిని ప్రధాన కారణం కరోనా మహమ్మారి కారణంగా వారికి వైద్య సదుపాయాలు అందకపోవడమే.

టీబీ ఎలా సోకుతుంది?
మైకోబ్యాక్టీరియమ్ టూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల క్షయవ్యాధి వస్తుంది. ఇది సాధారణంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. క్షయ అనేది నయం చేయగల, నివారించగల వ్యాధి. దగ్గు, తుమ్ము లేదా బిందువుల ద్వారా ఉమ్మివేసినప్పుడు ఇది వ్యక్తి నుండి వ్యక్తికి గాలి ద్వారా వ్యాపిస్తుంది.
టీబీ లక్షణాలేంటి?
టీబీ ఉన్న వ్యక్తి దగ్గు, నిరీక్షణ, హిమోప్టిసిస్, జ్వరం, రాత్రి చెమటలు, ఆకలి లేకపోవడం లేదా 2 వారాల కన్నా ఎక్కువ బరువు తగ్గడం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. చికిత్స మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు.
సమ్మర్ స్పెషల్.. పుచ్చకాయ జ్యూస్
గెలిచినా భయపడుతున్న సారు ‘కారు’
