పాడు క్రిమి రానే వచ్చింది
తెలియని రోగం తెచ్చింది
ఉండాలిక దూరం దూరం
పలకాలి కరోనాకి అంతం.
ముక్కులకి రక్షణ వస్త్రం
నోటికి అడ్డ గుడ్డ కవచం
చేతులెత్తి చేసే నమస్కారం
మనుషులకేది సంస్కారం.
లోకమంతను అగత్యం
కరోనా చేయు అంతం
జాగ్రత్తలే ఇవ్వు జీవితం
లేకుంటే కలుగు మరణం.
కరోనా..కరవనా అంటుంటే
ఇంటిలో ఉండమంటుంటే
బయటకెళ్ళక బ్రతకమంటే
తూనీగలాగ తిరుగుడేలా?.
జీవితం గడుపు ప్రాణిగా
కొమ్ముల రాకసి కాటుకు
బలిగాకు పేణం వదలకు
బ్రతుకు సాగు మనిషిగా..
అశోక్ చక్రవర్తి నీలకంఠం,
బడంగపేట, హైదరాబాద్.
మెయిల్: ashokprudvi@gmail.com
మీ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. నలుగురిని ఆలోచింపజేసే ఏ ఆర్టికల్ ను అయినా మా వెబ్సైట్ లో పబ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టికల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..
Share this content: