Breaking
Tue. Nov 18th, 2025
coronavirus india
coronavirus india

దర్వాజ

ఏ వాక్సినూ దొరకనే లేదు
ఆక్సీజనేమో అందడం లేదు
చైనా పంపిన కరోన జబ్బది
దాన్ని నయంజేసే మందేది?.

లాక్ఠౌనులు పెట్టేసేయంగా
అందరు దూరం బ్రతకంగా
సరదాలన్నీ బందాయ్యే
జనం ఇంట ఉండిపోయే.

చేతులు సబ్బున రుద్దేసి
కాయ గూరలు కడిగేసి
శుభ్రంగా శానిటైజు చేసేసి
మొహానికి ఆవిరి పట్టేసి…

ముక్కున మాస్కేద్దామంటే
సర్జికల్ మాస్కు బెష్టంటూ
క్లాతుముక్క మంచిదంటూ
మాస్కేయడం మర్సిపోయే!.

కోవిషీల్డ్ మంచిదేనా
కోవాక్సీన్ దొరికేనా
ఏ వాక్సిను వేస్తే ఏమౌనో
అనుమానం పెరిగిపోయే
వాక్సినంతా అయ్యిపోయే.

ఎక్కడికో వెళ్ళి వస్తే
గొంతులో నొప్పి వచ్చే
వొళ్ళంతా జ్వరమొచ్చే
రుచీవాసన తెలియక పోయే…

కరోన రోగం వచ్చినట్లాయే
ఆక్సీజన్ కరువయ్యి పోయే
ఆసుపత్రి బెడ్డు లేక పోయే
చావుబతుకు తెల్వకాయే
పేణాలు కొనవూపిరాయే.

Related Post