Loading Now
importance of trees darvaaja.com

తలపెడుతున్నం అపకారం !

దేవుడు ఈ ప్రపంచానికి చేసాడు చెట్టు అనే శ్రీకారం,

మనం జీవనం సాగుతుంది అది ఇచ్చే శ్వాస ప్రకారం,

చెట్లును గౌరవించటం, ప్రకృతి నీ ప్రేమించటం మన సంస్కారం,

కానీ మనం తరువు మీద చూపిస్తున్నాం అధికారం,

దాని వల్ల మన చుట్టూ అలుముకుంది కాలుష్యం అనే కారాగారం,
ఒక మొక్క నాటితే మనకు కలుగుతుంది శుభకారం,
చెట్లను నరికితే అదే మన అహంకారం

తరువు తో ప్రయాణం మనకు నేర్పుతుంది మమకారం,

ఆ మమకారం లేకపోతే మన జీవితం అవుతుంది అందవికారం,

ఈ ప్రకృతి, ఆ చెట్లు మనకి చేస్తున్నాయి ఎంతో ఉపకారం,

కానీ మనమే వాటికి తలపెడుతున్నాం అపకారం,

తుఫాన్లు, కరువు లతో మనకి చూపిస్తుంది భూదేవి తన ప్రతీకారం,

దాని తో థరణి కోల్పోతుంది తన ఆకారం,

ఒక మొక్క నాటితే మన విశ్వం అంతా మారుతుంది ప్రకృతి పరివారం,

దాని తో మన జీవితానికి అందుతుంది ఆరోగ్యాల విహారం,

భూమి మీద చెట్లు లేకుంటే మన జీవితం అవుతుంది చమత్కారం,

చెట్లును రక్షిస్తే అదే మనం వాటికి ఇచ్చే రుణం అనే సత్కారం.

anam-asritha-reddy తలపెడుతున్నం అపకారం !

ఆనం ఆశ్రిత రెడ్డి,

బీటెక్ స్టూడెంట్, ఖమ్మం.

మెయిల్: anamaasritha18@gmail.com

Share this content:

You May Have Missed