Loading Now
Is KILLING meant to be LOVE

ప్రేమంటే సంపేసుడేనా ?

ప్రేమంటే ముఖం మీద యాసిడ్ పోయ‌డ‌మే కదా..!
లేక‌పోతే పెట్రోలు పోసి త‌గ‌ల బెట్ట‌డ‌మా ?
కాక‌పోతే గొంతు నులిమి చంపేయ‌డ‌మేనా ?
మ‌రి అట్లాకాకుండా ఊరికించి ఉరికించి క‌త్తుల‌తో న‌రికేయ‌డమా ?
అలా కాక‌పోతే.. తినే బువ్వ‌లో కొంచెం విషాన్ని క‌లపి తినిపించ‌డ‌మా ?

“అరే.. గిదేంటి గిట్లా అంటున్నావ్ ?” “అలా ఎవ‌రైనా చేస్తారా ?” “అది ప్రేమెట్లైత‌ది ?” “అలా చేసేవాడు మ‌నిషి ఎట్లా అయిత‌డు” అని అంటారా ? లేక‌పోతే.. “అంతే చంపేయాల్సిందే అని స‌మ‌ర్ధిస్తారా ?”

గదీ మీ ఇష్టం.. కానీ ఒక్క‌సారి మాత్రం ఆలోచించండి. పాప పుట్టింద‌ని ఎంతో సంతోష‌ప‌డే మ‌నం అదే పాప పెరిగి పెద్ద‌య్యాక “నాకు ఒక‌డు న‌చ్చాడు” అంటే..? ఏమీ ఆలోచించ‌కుండా.. చంపేసే ప్ర‌బుద్ధులు మ‌న సూట్టూ ఎంతో మంది ఉన్నారు. ఒక అమ్మాయి “నా వెంట ప‌డొద్దు.. మా నాన్నకు చెప్తా” అంటే.. యాసిడ్ పోసే మూర్ఖులు ఇంకా మ‌న‌లో ఒక‌రిగా బ‌తుకుతునే ఉన్నారు.

ఒక‌రితో న‌వ్వుతూ మాట్లాడింద‌ని.. పెళ్లాని గొంతు నులిమి చంపే దుర్మార్గులు నేటికీ బ‌తికే ఉన్నారు. అమ్మ‌, అక్క గురించి బ‌య‌ట ఎవ‌డో ఏదో అనుకుంటున్నార‌ని విషం పోసి చంపేసిన మొద‌న‌ష్ట‌పు మ‌నుషులు ఇప్పుడు లేరు అని చెప్ప‌గ‌ల‌రా ? ఇలాంటి ఉద్దాంతాలు జ‌రిగిన‌ప్పుడు వాట్సాప్ లో, ఫేస్ బుక్కుల్లో “మంచి ప‌ని చేశాడురా వాడు” అని కామెంట్ చేసే దుష్టులు కూడా ఎంతో మంది క‌నిపిస్తునే ఉన్నారు క‌దా? ఇలాంటి వారంతా ఒక్క‌టి గుర్తు పెట్టుకోవాలే..

ప్రేమంటే.. నీకు న‌చ్చిన‌ట్లు అవ‌త‌లి వారు ఉంటేనే న‌చ్చ‌డం కాదు.. త‌న ఇష్టాల‌‌ను నువ్వు గౌర‌వించ‌డం. త‌న‌కు న‌చ్చిన‌ట్లు బ‌త‌క‌నివ్వ‌డం.. త‌ప్పు అని అనిపిస్తే.. ఎందుకు త‌ప్పో తెలిసేలా వివ‌రించ‌డం. త‌న‌కు కావ‌ల్సింద‌ల్లా కొని ఇస్తున్నా.. అని బానిస‌గా మార్చ‌డం కాదు.. త‌న బాస‌ట‌గా నిల‌వ‌డం. ముఖ్యంగా త‌ను ఇష్టం లేదు అంటే.. దాన్ని అర్థం చేసుకుని ప‌క్క‌కు త‌ప్పుకోవ‌డం.

అలాగే త‌నకు సంప్ర‌దాయాల పేరుతో అడ్డు క‌ట్ట‌లు వేయ‌కుండా ప్ర‌పంచంతో ముందుకు న‌డ‌ప‌డం. త‌న స్థానం అమ్మ, అక్క‌, చెల్లి, కూతురు, పెళ్లాం మాత్ర‌మే కాదు. ప్ర‌తీ అడుగులో మ‌న‌తో న‌డిచే శ‌క్తిగా గుర్తించ‌డం. ఆడొళ్లు అంటే కేవ‌లం మీ ఇంట్లో ఉండే వాళ్లు మాత్ర‌మే కాదు. బ‌య‌ట క‌నిపించే అమ్మాయిలు కూడా మీ అక్కో చెల్లో అని ఫీల్ అవ్వ‌డం.

మీ మ‌గ‌త‌నం.. కండ‌రాల్లో బ‌లం లేని ఆడొళ్ల మీద కాదు.. త‌న‌ను ఒక‌డు ఏడిపిస్తున్నాడు అన‌గానే.. నువ్వు ఎక్క‌డ స్కూల్ కాలేజీ బంజేపిస్తావో.. అని భ‌యం భ‌యంతో బ‌తికే మీ అక్క‌, చెల్లికి బాస‌ట‌గా నిలువు. “నేను ఉన్నాను.. నువ్వు స‌దువుకో.. నీకు ఏం కాకుండా చూసుకుంటా..” అనే భ‌‌రోసాను ఇవ్వ‌డం. నువ్వు కూడా బ‌య‌ట క‌నిపించిన అమ్మాయిల ప‌ట్ల అలా వ్య‌వ‌హ‌రించ‌కుండా న‌డ‌వ‌డం.

ప్రేమంటే సెక్స్ కాదు డ్యూడ్.. ప్రేమంటే గౌవ‌రం. ప్రేమంటే అభిమానించ‌డం, ప్రేమంటే ప్రొటెక్ట్ చేయ‌డం. ఇది అర్థం అయితే.. నువ్వు చేస్తే ఒప్పు, నీ అక్కో, చెల్లో, కూతురో చేస్తే.. త‌ప్పుగా క‌నిపించ‌దు. ఆలోచిస్తావ్.. ఆచ‌రిస్తావ్… అర్థం చేసుకుంటావ్. గ‌ప్పుడు ఎవ‌డైనా ఇలా అలోచిస్తే.. వాడి తాట తీస్తావ్.. జ‌ర యాదికి పెట్టుకో..

ప‌శువులు కూడా త‌న బిడ్డ‌లు కానీ వాటినైనా గింత క్రూరంగా చంప‌వు. మీరు మాన‌సిక రుగ్మ‌త‌ల‌తో బ‌తుకుతున్నారు. వాటిని త‌రిమి కొట్టాలంటే.. నీ ఆలోచ‌న శ‌క్తి పెర‌గాలి. గ‌ప్పుడే వీటిని అడ్డుకుంటావ్.. వాళ్ల‌ను ఆదుకుంటావ్.. ప్రేమ‌ను ప్రేమ‌గా చూస్తావ్..! లేక‌పోతే.. మంచి మ‌నుషులు నిన్ను గుర్తిస్తే.. నీకు బుద్ధి చెప్తారు.

viswas-vatte-1019x1024 ప్రేమంటే సంపేసుడేనా ?

విశ్వాస్ వట్టె

నల్గొండ(టౌన్),

viswasvatte.1995@gmail.com

మీ అభిప్రాయాల‌ను ప్ర‌పంచంతో పంచుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆల‌స్యం.. న‌లుగురిని ఆలోచింప‌జేసే ఏ ఆర్టిక‌ల్ ను అయినా మా వెబ్సైట్ లో ప‌బ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టిక‌ల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..

అసమ్మతి దేశద్రోహం కాదు !

రాజా.. ఏంటీ క‌య్యం ?

క‌డుపునొప్పి, విరోచ‌నాలు అయితే వెంటనే జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

షుగ‌ర్ తో జ‌ర పైలం!

కోమ‌ల‌మైన నిగారింపు కోసం ఈ చిట్కాలు పాటించండి!

Share this content:

You May Have Missed