Breaking
Sat. Jun 28th, 2025

నూతలపాటి ఘనాపాటి..!

Chief Justice of India Justice NV Ramana
Chief Justice of India Justice NV Ramana

నాడొక సాధారణ వ్యక్తిగా మొదలయ్యే అతని ప్రయాణం.. నేడొక అత్యున్నత న్యాయ పీఠం అధిరోహించిన వైనం.. కృషి ఉంటే మనిషి ఋషి కాగలడు అనేందుకు ఆయనో తార్కాణం… ఆయనే నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేట్టిన జస్టిస్ .యన్వీ.రమణ.

స్వాతంత్ర్య భారతావనికే
దిక్సూచి నేటి అతని గమనం.

నాటి విద్యార్థి గొంతుకగా
సామాన్యుల హక్కు స్వరం
వార్తా శోధనలో ప్రజా వేగు
నిరంతరం సాగే తపనతో..

బుడిబుడి అడుగుతో చేరే
న్యాయశాస్త్ర కోవిదుడై
అంచలంచెలగా చేరే పీఠం
తీర్పులున న్యాయదేవతై.

తొలినాళ్ళలో అతడో వాది
క్రమాన న్యాయమూర్తిగా
పదవుల సోపాన విహారి
ఆం.ప్ర హైకోర్టులో స్థానం.

ఎన్నో తీర్పులు చుక్కాణిగా
మురిసెను న్యాయ దేవతా
అవకాశం అందిపుచ్చుకుని
ప్రధాన న్యాయమూర్తిగా…

దేశం నడిబొడ్డున గల ఢిల్లీ
ఆన ప్రధాన న్యాయమూర్తి
తెలుగోడి స్వర పీఠి ఝరి
న్యాయ స్థానాన తీర్పే గురి.

ఎన్వీరమణ సుప్రీంకోర్టుకు
అగ్ర న్యాయవ్యవస్థకు చేరు
క్రమేణా గమ్య సోపానం
దక్కే ప్రధాన సింహాసనం.

పగలు రాత్రుల కష్ట ఫలం
అంత సులభమేమి కాదేది
అతనెప్పుడు మార్గదర్శి
అతడి తీరు చూపు స్ఫూర్తి.

న్యాయకలాన మేలుజేయు
సమాజపు తీరులు మార్చు
న్యాయం కొత్త పుంతలుగా
నిజ రుజువు ఆలంబనగా..

ashoka-chakravarthy-neelakantam-darvaaja.com_-775x1024 నూతలపాటి ఘనాపాటి..!

అశోక్ చక్రవర్తి నీలకంఠం,
బడంగపేట, హైదరాబాద్.
మెయిల్: ashokprudvi@gmail.com

మీ అభిప్రాయాల‌ను ప్ర‌పంచంతో పంచుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆల‌స్యం.. న‌లుగురిని ఆలోచింప‌జేసే ఏ ఆర్టిక‌ల్ ను అయినా మా వెబ్సైట్ లో ప‌బ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టిక‌ల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..

Related Post