ఈ చదువుకున్న మూర్ఖుల్ని (..) అస్సలు నమ్మకండి.
తమ అరగుండు మెదడుతో, పుచ్చిన తలకాయల్తో దేశం అంటే ఒక మూరెడు పతాకమని, దేశాన్ని ప్రేమించడమంటే గుడ్డముక్క ఆ పతాకాన్ని కొయ్యకి గుచ్చి ఎగరేయడమేనని లోకం తెలియని స్కూలుపిల్లలకు, లౌక్యం తెలియని పేదజనాల్ని, పల్లెజనాల్ని, కింది కులాల్ని నమ్మిస్తారు. మనకు స్వాతంత్రం వచ్చిందని ప్రకటిస్తారు. ప్రభుత్వాల పాదాలకు మడుగులొత్తుతారు.
ఇదే మాటలు ఏ డబ్బున్నోడికో, ఏ కాంట్రాక్టరుకో, ఏ కార్పొరేట్‌కో, ఏ రాజకీయనాయకుడికో చెప్పమనండి చూద్దాం. వాడి పిల్లల చేతిలో పతాకం పెట్టి వీధుల్లో తిరగమని చెప్పమనండి చూద్దాం. వాళ్ల బంగళాలమీద పతాకం ఎగరేయమని చెప్పమనండి చూద్దాం.
వీళ్లని గుర్తుపట్టడం సుళువు. వీళ్లు ప్రతి పండగకు ముందురోజే శుభాకాంక్షలు చెబుతారు. సినిమాలు, సంప్రదాయాలు, దేవుళ్లు, పుణ్యక్షేత్రాలు, ధర్మ నిరతుల గురించి ఆపేక్షగా రాస్తూంటారు. కానీ అదే చేతుల్తో స్త్రీల వెతల గురించీ, శ్రమ దోపిడీల గురించి, కుల వివక్షల గురించీ, పేదరికాల గురించీ, సామాన్యుల హక్కుల గురించీ ఎన్నడూ రాయరు…
జాగరూకులై వుండండి!
రచయిత: రవి మిట్టపల్లి, MA, LLM
సిద్ధిపేట
(ఈ పేజీలో వచ్చే కథనాలు, కవితలు కేవలం ఆయా రచయితలకు చెందిన అభిప్రాయాలు.. )
మీ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. నలుగురిని ఆలోచింపజేసే ఏ ఆర్టికల్ ను అయినా మా వెబ్సైట్ లో పబ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టికల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..
Share this content: